అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం డీసీ. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబెడుతోంది. అయితే ఈ చిత్రం చూసిన మలయాళ దర్శకుడు రంజిత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’చూసినప్పుడు ఎలా అనిపించిందో ఈ సినిమా చూసినప్పుడూ అదే అనుభూతి కలిగిందని పేర్కొన్నారు.
సినిమా చూసి ఇలా అనుకున్నా..
‘దాదాపు 30 ఏళ్ల క్రితం తిరువనంతపురంలోని కృపా థియేటర్‌లో‘’ సినిమాను చూశాను. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఈ మాధ్యమాన్ని చూపించగలనా? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇప్పుడు డీసీ చూసికూడా దాదాపు ఇదే అనుభూతి కలిగింది’ అని శంకర్ పేర్కొన్నాడు.
‘సత్య’ ఎలా ఉంటుందంటే..
1998 జూలై 03న విడుదలైన ‘సత్య’ సినిమాని రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించారు. మనోజ్ బాజ్‌పేయీ, జేడీ చక్రవర్తి, ఊర్మిళా మటోండ్కర్, సౌరభ్ శుక్లా, షెఫాలీ షా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ భరద్వాజ్ సంగీతం అందించగా, సందీప్ చౌతా నేపథ్య సంగీతం సమకూర్చారు.
ముంబయి అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామాలో.. సత్య అనే యువకుడు పరిస్థితుల కారణంగా గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం, అక్కడి స్నేహాలు, ప్రేమ, నేరాలు, సంఘర్షణలే ప్రధాన కథగా తెరకెక్కించారు. సహజమైన పాత్రలు, వాస్తవికమైన టేకింగ్‌తో ‘సత్య’ భారతీయ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది.
డీసీ ఎలా ఉంటుందంటే..
డీసీ.. కూడా గ్యాంగ్‌స్టార్ స్టోరీనే కానీ..అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతోపాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు. భావోద్వేగాలకూ పెద్దపీట వేయడంతో ఓ డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.


