కళామతల్లికి కులమతాలు లేవు: మంచు మనోజ్‌ | Manchu Manoj Launches Gaja Teaser | Sakshi
Sakshi News home page

కళామతల్లికి కులమతాలు లేవు: మంచు మనోజ్‌

Aug 11 2026 12:23 AM | Updated on Aug 11 2026 12:23 AM

Manchu Manoj Launches Gaja Teaser

సునీల్, మంచు మనోజ్, మైత్రి శరణ్, ఫెర్నాజ్, సతీష్‌ జై

‘‘ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు. కళామతల్లికి కులమతాలు లేవు. చిన్న, పెద్ద, కొత్త, పాత అనే తేడా లేకుండా కంటెంట్‌ బాగున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ‘గజ’ టీజర్‌ బాగుంది. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని హీరో మంచు మనోజ్‌ చెప్పారు. సతీష్‌ జై హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘గజ’. ఫెర్నాజ్‌ హీరోయిన్ గా నటించారు.

చలమలశెట్టి సునీల్‌ సమర్పణలో సతీష్‌ జై ఫిల్మ్స్‌పై డాక్టర్‌ మైత్రి శరణ్, సతీష్‌ జై నిర్మించారు. సోమవారం నిర్వహించిన ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరై, టీజర్‌ లాంచ్‌ చేశారు. సతీష్‌ జై మాట్లాడుతూ–‘‘ఒక ప్రేక్షకుడిగా ఆలోచించి ‘గజ’ కథ రాసుకున్నాను.

సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా మూవీని సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు నిర్మాత మైత్రి శరణ్, చలమలశెట్టి సునీల్‌. ఈ కార్యక్రమంలో ఫెర్నాజ్, సహ–  నిర్మాతలు మధు సూదన్ , పద్మనాభ రెడ్డి, నిర్మాత ‘సెవెన్‌ హిల్స్‌’ సతీష్, కెమెరామెన్‌ జగదీష్‌ చీకటి, లిరిసిస్ట్‌ మిట్టపల్లి సురేందర్‌ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement