పల్లెటూరి ప్రేమ కథా చిత్రం.. ఆసక్తిగా పోస్టర్ | Tollywood Love entertainer First look Poster and title Revealed | Sakshi
Sakshi News home page

Tollywood Movie: పల్లెటూరి ప్రేమ కథా చిత్రం.. ఆసక్తిగా పోస్టర్

Aug 10 2026 10:11 PM | Updated on Aug 10 2026 10:11 PM

Tollywood Love entertainer First look Poster and title Revealed

శ్రీరామ్, రమిక శివు జంటగా నటిస్తోన్న లేటేస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ ప్రేమనే ఊరిలో. ఈ మూవీకి మనోజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రామీణ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, పల్లె జీవనశైలిని ప్రతిబింబించే కథగా రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. ఈ పోస్టర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేమను పల్లె అందాలతో ముడిపెట్టి చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సునద్ గౌతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై  చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement