ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.
తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ చిత్రంలో మీరు కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నారా? ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేయాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్ చూపించే వీడియోలను పంపండి. ఈ క్రేజీ ఛాన్స్ కొట్టేయండి అంటున్నారు మేకర్స్.
తాజాగా ఈ సీక్వెల్ మూవీలో నటించాలనుకునే వారి కోసం క్యాస్టింగ్ కాల్ వచ్చేసింది. ఈ అరుదైన గోల్డెన్ ఛాన్స్‌ను మీ రెండు చేతులతో ఒడిసి పట్టుకోండి. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎలాంటి షరతులు లేకుండా ఈ మూవీ ఛాన్స్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రేజీ ఛాన్స్ కోసం తమ వివరాలను, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే మెయిల్ చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలోని టాలెంట్ బయటికి తీసి ప్రభాస్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేయండి.
Here’s an opportunity for all aspiring actors!
Come be a part of the KALKI CINEMATIC UNIVERSE.
📩 kalkiuniversecasting@gmail.com#Kalki2898AD #CastingCall pic.twitter.com/hUKIoRfv2k— Kalki 2898 AD (@Kalki2898AD) August 10, 2026


