breaking news
Casting
-
ప్రభాస్ మూవీలో ఛాన్స్.. మీ టాలెంట్ బయటికి తీయండి..!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ చిత్రంలో మీరు కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నారా? ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేయాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్ చూపించే వీడియోలను పంపండి. ఈ క్రేజీ ఛాన్స్ కొట్టేయండి అంటున్నారు మేకర్స్.తాజాగా ఈ సీక్వెల్ మూవీలో నటించాలనుకునే వారి కోసం క్యాస్టింగ్ కాల్ వచ్చేసింది. ఈ అరుదైన గోల్డెన్ ఛాన్స్‌ను మీ రెండు చేతులతో ఒడిసి పట్టుకోండి. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎలాంటి షరతులు లేకుండా ఈ మూవీ ఛాన్స్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రేజీ ఛాన్స్ కోసం తమ వివరాలను, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే మెయిల్ చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలోని టాలెంట్ బయటికి తీసి ప్రభాస్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేయండి. Here’s an opportunity for all aspiring actors! Come be a part of the KALKI CINEMATIC UNIVERSE. 📩 kalkiuniversecasting@gmail.com#Kalki2898AD #CastingCall pic.twitter.com/hUKIoRfv2k— Kalki 2898 AD (@Kalki2898AD) August 10, 2026 -
వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ.. నిర్మాణ సంస్థ అలర్ట్..!
సంక్రాంతికి హిట్ కొట్టే మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి వెంకీమామతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న మరో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీలో కల్యామ్ రామ్ కూడా నటిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే ఈ మూవీ ప్రారంభమైందో లేదో మూవీ యూనిట్‌కు కొత్త చిక్కులొస్తున్నాయి. అప్పుడే కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో మోసానికి తెరలేపారు. అనిల్ రావిపూడి- వెంకీ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొత్త ప్రకటనలు ఇస్తున్నారు. సినిమా అవకాశాల పేరిట మోసం చేసేందుకు కేటుగాళ్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ స్పందించారు.దీనిపై నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటన విడుదల చేసింది. అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు దయచేసి ఎవరూ కూడా అలాంటివీ నమ్మవద్దని ప్రకటనలో తెలిపింది. ఆ కాస్టింగ్ కాల్‌కు.. మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. మా తరఫున కాస్టింగ్ పేరుతో సంప్రదించే వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పత్రాలు, డబ్బులు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. మా చిత్రానికి సంబంధించిన ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే.. మా అధికారిక, ధ్రువీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రకటిస్తామని తెలిపింది. దయచేసి మోసగాళ్ల ఉచ్చులో పడకండని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ⚠️ FAKE CASTING ALERT ⚠️Any casting call currently being circulated in the name of #VenkyAnil5 - #NKRAR2 is FAKE and unauthorized.We urge aspiring artists and the general public not to fall prey to such scams.Any official casting-related announcements will be made only… pic.twitter.com/NlLunpq20k— Shine Screens (@Shine_Screens) June 22, 2026 -
పేకమేడలు హీరోయిన్ సంచలన కామెంట్స్
-
ఆస్కార్‌లో కొత్త అవార్డు
ఆస్కార్ అవార్డుల్లో ఓ కొత్త కేటగిరీ చేరనుంది. ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్స్‌కు ఓ కేటగిరీని చేర్చినట్లు అకాడమీ వెల్లడించింది. దీంతో ఆస్కార్ అవార్డుల విభాగాల సంఖ్య 24కు చేరనుంది. కానీ ఈ ఏడాది మార్చి 10న జరగనున్న 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ, 2025లో జరిగే 97వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ ‘క్యాస్టింగ్ డైరెక్టర్స్’ విభాగంలో అవార్డును ప్రదానం చేయరు. 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. అంటే.. 2025లో రిలీజయ్యే సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అవుతారు. ‘‘ఫిల్మ్ మేకింగ్ విభాగంలో, ఆస్కార్ ప్రదానోత్సవంలో క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడు వారిని ఈ ప్రదానోత్సవంలో భాగం చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జానెట్ యంగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ క్రామెర్. ‘‘క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు’ అనేది మా కృషికి గుర్తింపుగా భావిస్తున్నాం. ఆస్కార్ అకాడమీకి «థ్యాంక్స్’’ అని క్యాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్ గవర్నర్లు రిచర్డ్ హిక్స్, కిమ్ టేలర్–కోల్మన్, డెబ్రా జేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించి ఓ కేటగిరీని చేర్చారని, చివరిసారిగా 2001లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌ను చేర్చారని హాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. -
ప్రభాస్‌తో కలిసి సినిమాలో నటించాలనుకుంటున్నారా?
Want To Act With Prabhas In Nag Ashwin Movie?: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్‌ని సొంతం చేసుకోవచ్చంటూ కాస్టింగ్ కాల్‌ను అనౌన్స్ చేశారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తన నెక్స్ట్ ఫిల్మ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్-కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటించనుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 50-70 ఏళ్ల వయసున్న ఆసక్తి ఉన్న స్త్రీ -పురుషులు ఆడిషన్స్ వీడియో పంపాలంటూ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పేర్కొంది. అయితే హైదరాబాద్‌లో నివసించే వారికే ఈ అవకాశం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాను భారీ సాంకేతిక హంగులతో తెరకెక్కించనున్నారు. దాదాపు 300కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. Hyderabadis, its your turn now, Hurry up!!! Be the Face of the Future.#ProjectK #Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/4ECOnL0wQO — Vyjayanthi Movies (@VyjayanthiFilms) November 26, 2021 -
కలవారి కోడలు... మళ్లీ వచ్చింది!
నటీనటులు ఎంతోమంది ఉన్నా, కొందరే ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోతారు. ప్రేక్షకుల్ని తమ నటనతో ఫిదా చేసేసి, వాళ్ల మనసుల్లో సింహాసనం వేసుకుని కూర్చుంటారు. బుల్లితెర ప్రేక్షకులను అలా కట్టిపడేసిన నటి... సుజిత. కలవారి కోడలు, కలిసుందాం రా, గంగోత్రి వంటి సీరియల్స్‌తో ఆమె టెలివిజన్ సూపర్‌స్టార్ అయిపోయింది. అయితే ఎందుకనో గత కొంతకాలంగా ఆమె అంతగా కనిపించడం లేదు. దాంతో సుజిత ఏమైపోయిందా అనుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే ఈ మధ్య సడెన్‌గా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సీరియల్‌తో బుల్లితెరపై ప్రత్యక్షమయ్యింది. దాంతో ఆమెను ఇన్ని రోజులూ మిస్ అయిన అభిమానులు సంబరపడుతున్నారు. ఆమె సీరియల్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటాయి కాబట్టి టీవీ స్క్రీన్లకు కాన్ఫిడెంట్‌గా కళ్లప్పగించేస్తున్నారు!


