వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ.. నిర్మాణ సంస్థ అలర్ట్..! | ani ravipudi and venkatesh movie makers fraud alert about casting call | Sakshi
Sakshi News home page

VenkyAnil5: వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. నిర్మాణ సంస్థ అలర్ట్..!

Jun 22 2026 5:23 PM | Updated on Jun 22 2026 5:38 PM

ani ravipudi and venkatesh movie makers fraud alert about casting call

సంక్రాంతికి హిట్ కొట్టే మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి వెంకీమామతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న మరో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీలో కల్యామ్ రామ్ కూడా నటిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

అయితే ఈ మూవీ ప్రారంభమైందో లేదో మూవీ యూనిట్‌కు కొత్త చిక్కులొస్తున్నాయి. అప్పుడే కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో మోసానికి తెరలేపారు. అనిల్ రావిపూడి- వెంకీ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొత్త ప్రకటనలు ఇస్తున్నారు. సినిమా అవకాశాల పేరిట మోసం చేసేందుకు కేటుగాళ్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ స్పందించారు.

దీనిపై నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటన విడుదల చేసింది. అవన్నీ ఫేక్‌ అంటూ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు దయచేసి ఎవరూ కూడా అలాంటివీ నమ్మవద్దని ప్రకటనలో తెలిపింది.  ఆ కాస్టింగ్ కాల్‌కు.. మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. మా తరఫున కాస్టింగ్ పేరుతో సంప్రదించే వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పత్రాలు, డబ్బులు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. మా చిత్రానికి సంబంధించిన ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే..  మా అధికారిక, ధ్రువీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రకటిస్తామని తెలిపింది. దయచేసి మోసగాళ్ల ఉచ్చులో పడకండని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement