బ్రో... రిలాక్స్‌! | Mrunal Thakur Reacts To Yashasvi Jaiswal Dating Rumors | Sakshi
Sakshi News home page

బ్రో... రిలాక్స్‌!

Aug 10 2026 3:49 AM | Updated on Aug 10 2026 3:49 AM

Mrunal Thakur Reacts To Yashasvi Jaiswal Dating Rumors

తిట్టకుండా తిట్టినట్లు కౌంటర్‌ ఇచ్చారు మృణాల్‌ ఠాకూర్‌. అసలేం జరిగిందంటే... తన కన్నా వయసులో పదేళ్లు చిన్న అయిన స్టార్‌ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌తో మృణాల్‌ డేటింగ్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించి ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘బ్రో... రిలాక్స్‌. మేమిద్దరం ఎక్కడైనా జంటగా కనిపించామా? మీరు చూపించండి. చదువుకున్న మీలాంటివాళ్లు ఇలాంటి వదంతులు నిజం అని ఎలా నమ్ముతారు? దేశంలో ఎంతో జరుగుతోంది. జెన్‌ జీ నుంచి నేర్చుకుని, సరైన టాపిక్స్‌ మీద వీడియోలు చేయండి... అప్పుడు మీకు కావల్సినన్ని వ్యూస్‌ వస్తాయి’’ అని సోషల్‌ మీడియా వేదికగా మృణాల్‌ ఠాకూర్‌ స్పందించారు. 

ఇక ముంబైలోని ఓ కేఫ్‌ నుంచి మృణాల్, యశస్వి జైస్వాల్‌ విడి విడిగా వచ్చిన ఓ వీడియోను ఉద్దేశించి... ఈ ఇద్దరూ డేటింగ్‌ అనే వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మృణాల్‌ చేసిన కామెంట్‌కి నెటిజన్లు ఆమెకు మద్దతుగా ‘అబద్ధపు వార్తను ఎలా ప్రచారం చేస్తున్నారో? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు ఒకే రెస్టారెంట్‌కి వెళ్లకూడదా?’ అంటూ వదంతులు ప్రచారం చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement