ఆమిర్‌తో అట్లీ? | Tamil director Atle to work with Aamir Khan | Sakshi
Sakshi News home page

ఆమిర్‌తో అట్లీ?

Aug 10 2026 3:45 AM | Updated on Aug 10 2026 3:45 AM

Tamil director Atle to work with Aamir Khan

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించనున్న కొత్త చిత్రంపై పూర్తి స్థాయిలో ఇంకా సరైన స్పష్టత రావడం లేదు. ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్, ‘త్రీ ఇడియట్స్‌’ సీక్వెల్, దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో ఓ సూపర్‌ హీరో మూవీ, అశుతోష్‌ గోవారీకర్‌ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ మూవీ  అంటూ ఆమిర్‌ నెక్ట్స్‌ చిత్రాలపై వార్తలు వినిపిం చాయి. కానీ ఇప్పటివరకు ఏ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు.

తమిళ దర్శకుడు అట్లీ ఇటీవల ఆమిర్‌ ఖాన్‌కు ఓ స్టోరీ లైన్‌ చె ప్పారట. ఈ కథ నచ్చి, ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట ఆమిర్‌. అయితే ఫైనల్‌ నరేషన్‌ జరగాల్సి ఉందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న ‘రాకా’ చిత్రీకరణతో అట్లీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆమిర్‌–అట్లీ కాంబినేషన్‌ సినిమా గురించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి... వీరి కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా? వేచి చూడాల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement