Want To Act With Prabhas In Nag Ashwin Movie, Check Auditions Details - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌ సినిమాలో నటించాలనుందా? అయితే ఈ గోల్డెన్‌ చాన్స్‌ మీకోసమే..

Nov 27 2021 5:08 PM | Updated on Nov 27 2021 6:43 PM

Want To Act With Prabhas In Nag Ashwin Movie, Check Auditions Details - Sakshi

Want To Act With Prabhas In Nag Ashwin Movie?: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రంలో నటించే  గోల్డెన్‌ ఛాన్స్‌ని సొంతం చేసుకోవచ్చంటూ కాస్టింగ్‌ కాల్‌ను అనౌన్స్‌ చేశారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ తన నెక్స్ట్‌ ఫిల్మ్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్‌-కె’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనె నటించనుంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించనున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 50-70 ఏళ్ల వయసున్న ఆసక్తి ఉన్న స్త్రీ -పురుషులు ఆడిషన్స్‌ వీడియో పంపాలంటూ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ పేర్కొంది. అయితే హైదరాబాద్‌లో నివసించే వారికే ఈ అవకాశం. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాను భారీ సాంకేతిక హంగులతో తెరకెక్కించనున్నారు. దాదాపు 300కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement