
విజయవాడ: ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తబృందాలు సారెను సమర్పించాయి. ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది.

ఆదివారం ఒక్క రోజే సుమారు 80 వేలకు పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న వంద మంది భక్తులలో దాదాపు 80 మంది చేతిలో అమ్మవారి సారె ఉండటం విశేషం.

అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో మహా మండపం 5వ అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడాయి.













