
పగలంతా ఎండ..సాయంత్రమైతే ఆకాశం మేఘావృతం..రాత్రయితే భారీ వర్షం..ఇదీ గత రెండు రోజులుగా విజయవాడలో పరిస్థితి.ఆదివారం కూడా ఇదే తరహాలో రాత్రి 7 గంటల తర్వాత కుండపోతగా వర్షం కురిసింది.

రోడ్లన్నీ జలమయమయ్యాయి.వర్షం, గాలుల ధాటికి బందరు రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో పై రేకు ఊడి పడింది.నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో జనాలు భానుడి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.


























