Amitabh Bachchan Spotted At Rayadurgam Metro Station, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan In Metro Station: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో బిగ్‌బి సందడి, ఫొటో వైరల్‌

Jun 30 2022 1:31 PM | Updated on Jun 30 2022 2:59 PM

Amitabh Bachchan Spotted At Rayadurgam Metro Station Photo Viral - Sakshi

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం పలు పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. బ్రహ్మస్త్రం, ప్రాజెక్ట్‌ కె వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవల బ్రహ్మాస్త్రం పార్ట్‌ 1 షూటింగ్‌ పూర్తి కాగా ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కోసం బిగ్‌బి గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆయన రాయదుర్గం మేట్రో స్టేషన్‌లో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

చదవండి: టాలీవుడ్‌లో సాయి పల్లవి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరో తెలుసా?

ఓ నెటిజన్‌ బిగ్‌బి ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘సాయంత్రం సమయంలో అత్యంత రద్ధిగా ఉండే మెట్రో స్టెషన్‌ ఇవాళ ఖాళీగా ఉంది. కేవలం కెమెరామెన్స్‌, ఇతర చిత్ర బృందంతో పాటు అమితాబ్‌ బచ్చన్‌ మాత్రమే ఉన్నారు’ అంటూ రాసుకొచ్చారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్తంలో ప్రభాస్‌, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల దీపికా హైదరాబాద్‌లో తన షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. 

చదవండి: Shruti Haasan: ప్రస్తుతం నేను ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement