సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తా: డైరెక్టర్ | Rajendra Prasad latest Movie release on this date | Sakshi
Sakshi News home page

Tollywood Movie: సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తా: డైరెక్టర్

Aug 10 2026 4:36 PM | Updated on Aug 10 2026 4:44 PM

Rajendra Prasad latest Movie release on this date

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'పాంచాలి పంచభర్తృక'. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై  వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్‌స్టా పేజికి టికెట్ పంపండి.. మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ప్రేక్షకులు మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదు. మా సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో మా మూవీ రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ చేశారు. ఇటీవల కాలంలో మాలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదని చెప్పగలను. ఈ సినిమా మేకింగ్‌లో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.' అన్నారు. కాగా.. ఈ సినిమాకు మహేశ్ నారాయణ, బి షేక్ సంగీతమందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement