ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. వీరి రెమ్యూనరేషన్స్‌ ఎంతో తెలుసా! | Idhayam Murali Cast Fees Actors | Sakshi
Sakshi News home page

ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. వీరి రెమ్యూనరేషన్స్‌ ఎంతో తెలుసా!

Aug 10 2026 1:49 PM | Updated on Aug 10 2026 2:05 PM

Idhayam Murali Cast Fees Actors

తమిళ హీరో అధర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇదయం మురళి’. థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించడంతో వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్స్‌  ఎంతన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరి ఎంత తీసుకున్నారంటే..

ధర్వ మురళి:  ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు టాక్‌. 
ప్రీతి ముకుందన్‌:  ఈ సినిమాకు సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుందట.
కయాదు లోహర్‌:  ఈ బ్యూటీ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
నిహారిక ఎన్‌ఎం:  ఆమెకు ఈ సినిమాకు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది.
నట్టి నటరాజ్‌:   ఈ సినిమాకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం. 
తమన్‌:  ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్‌. ఈయన యాక్టర్‌గానూ ఈ సినిమాలో కనిపించారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మాళవిక మోహనన్‌: ఆమె సుమారు రూ.3 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం.

ఫహాద్‌ ఫాజిల్‌:  సాధారణంగా ఒక్కో సినిమాకు ఫహాద్‌ రూ.7 కోట్ల వరకు తీసుకుంటారట.

మొత్తంగా ‘ఇదయం మురళి’లో అధర్వ మురళితో పాటు ఫహాద్‌ ఫాజిల్‌, మాళవిక మోహనన్‌, కయాదు లోహర్‌, తమన్‌ వంటి పలువురు ప్రముఖులు కనిపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement