టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు నిన్న (ఆగస్టు 9) సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సందీప్ ఏఐ వీడియోతో శుభాకాంక్షలు చెప్పగా.. మహేశ్ ఫిదా అయ్యాడు. లెంజడరీ నటుడు కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్‌ను ఏఐతో రీక్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. భద్రకాళి పిక్చర్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్. మహేశ్ బాబు విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో 2027లో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


