'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం | Kiran Abbavaram Announces New Pan-India Movie Titled Indraputra, Poster Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: పాన్ ఇండియా మార్కెట్‌లోకి కిరణ్ అబ్బవరం

Aug 10 2026 11:37 AM | Updated on Aug 10 2026 12:00 PM

Kiran Abbavaram New Movie Titled Indraputra

తెలుగు యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, రాజావారు రాణిగారు' మూవీతో హీరో అయ్యాడు. తర్వాత పలు సినిమాలు చేశాడు గానీ చాలావరకు ఫ్లాపులే. ఎట్టకేలకు 'క' అనే థ్రిల్లర్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత వచ్చిన 'దిల్‌రుబా' డిజాస్టర్ కాగా.. కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు సక్సెస్ అయ్యాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్, దర్శకుడిగా ఓ మూవీ చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 'ఇంద్రపుత్ర' పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. సోమవారం ఈ టైటిల్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాటమరాయుడు, గాండీవధారి అర్జున, కుడి ఎడమైతే, కాంతార ఛాప్టర్ 1 సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల దీంతో దర్శకుడిగా మారుతున్నాడు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం మెచ్చుకోదగిందే గానీ అదెంత వరకు వర్కౌట్ అవుతుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే పోస్టర్ చూస్తుంటే డివోషనల్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఈ జానర్ ఇప్పుడు పాతబడిపోయింది. అదే టైంలో కిరణ్ మార్కెట్ కూడా టాలీవుడ్ వరకే పరిమితం. ఈ నిర్మాత గతంలో తెలుగు హీరో సుధీర్ బాబుతో 'జటాధర' అని ఓ మూవీ చేస్తే అది ఘోరంగా ఫెయిలైంది. మరి ఈసారి ఏం చేస్తారనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'టెంపర్' రీమేక్ చేశా: విశాల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement