కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్ , సాయిరాజేశ్ నిర్మించిన ఈ చిత్రం జూలై 24న విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో రవి నంబూరి మాట్లాడుతూ–‘‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం సంతోషంగా ఉంది. స్టీవెన్ శంకర్ పాత్రకు కిరణ్ పూర్తి న్యాయం చేశారు.
నివి పాత్రకు శ్రీగౌరిప్రియను నేనే సూచించాను. ఆమె నటన భావోద్వేగ సన్నివేశాలను మరింత బలంగా నిలబెట్టింది. మణిశర్మగారి సంగీతం, ఆర్‌ఆర్ ఈ చిత్రానికి అతి పెద్దబలం. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ యాక్సిడెంట్ సీన్ , క్లైమాక్స్‌లో డాగ్ సీక్వెన్స్ లను తెరకెక్కించడం సవాల్‌గా అనిపించింది. బడ్జెట్, సమయం ఎక్కువైనా నిర్మాతలు రాజీ పడకుండా సహకరించారు. బాక్సాఫీస్ వసూళ్ల కంటే ప్రేక్షకుల ప్రశంసలే నాకు ముఖ్యం. నా తర్వాతి చిత్రం ఎస్‌కేఎన్ తోనే ఉంటుంది’’ అన్నారు.


