'ఎల్‌జీబీటీ-ఏ లీగల్ బ్యాటిల్' సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ... ఈ సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తోంది. సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు, అవకాశాలతో వారు ముందుకు సాగాలి. 'ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్ పార్ట్-2' నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈయన ప్రకటించారు.
ఈ మూవీలో నటించిన సోనా రాథోడ్, విష్ణు తేజ రమణ, టీవీ రామన్, వంశీ తదితరులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చివరగా దీనికి కారణమైన ప్రేక్షకులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


