రీసెంట్ టైంలో రష్మిక పెళ్లి చేసుకుంది. మరో ఒకరిద్దరూ హీరోయిన్లు కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా త్వరలో కొత్త జీవితం ప్రారంభించనుందని, పెద్దల కుదిర్చిన సంబంధానికి ఓకే చెప్పిందని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? అసలివి ఎందుకొచ్చాయ్?
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)
ఒకప్పుడు తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్‌డమ్ సొంతం చేసుకున్న పూజాహెగ్డే.. ప్రస్తుతం హిందీ, తమిళంలో మాత్రమే చేస్తోంది. ఈమె నటించిన 'జన నాయగన్' వారం క్రితమే రిలీజైంది. కానీ ఈమెకే పెద్దగా పేరు రాలేదు. అంతకు ముందు హిందీలో ఓ మూవీ చేసింది. ఇందులోనూ గ్లామర్ చూపించినప్పటికీ సక్సెస్ అందుకోలేదు.
ప్రస్తుతానికైతే పూజా చేతిలో కాంచన 4, దుల్కర్ సల్మాన్ చేస్తున్న తెలుగు మూవీ 'శ్రీశ్రీ'లో నటిస్తోంది. అయితే ఈమెకు ఆఫర్స్ తగ్గిపోవడంతో మూవీస్ చేయడం మునుపటిలా లేదు. ఈ క్రమంలోనే పూజా.. ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకోనుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదనిపిస్తోంది. లేదంటే ఏమైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)


