అస‌లెప్పుడు విడిపోయారు.. క‌లిసిపోవ‌డానికి? | Fact Check: Hardik-Pandya-Krunal Pandya Reunites-Stroms-Social Media | Sakshi
Sakshi News home page

Hardik-Krunal: అస‌లెప్పుడు విడిపోయారు.. క‌లిసిపోవ‌డానికి?

Aug 1 2026 9:18 PM | Updated on Aug 1 2026 9:28 PM

Fact Check: Hardik-Pandya-Krunal Pandya Reunites-Stroms-Social Media

Photo Credit: BCCI Twitter

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. టీమిండియా క్రికెటర్లయిన పాండ్యా బ్ర‌ద‌ర్స్‌కు సెప‌రేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఈ అన్న‌ద‌మ్ముల్లో త‌మ్ముడైన హార్దిక్ టీమిండియాలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. త‌మ్ముడంత కాక‌పోయినా కృనాల్ కూడా ఐపీఎల్ ద్వారా బాగానే గుర్తింపు పొందాడు. 

ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్ల‌లో స‌భ్యుడిగా ఉన్నాడు. అటు పాండ్యా కూడా ఈ రికార్డులో ముందువ‌రుస‌లో ఉన్నాడు. మ‌రి ఇప్పుడు వీరిద్ద‌రి ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చిందంటే.. తాజాగా హార్దిక్‌, కృనాల్‌లు క‌లిసిపోయారన్న వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఇటీవ‌లే ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ ఈ ఇద్ద‌రు అన్న‌దమ్ములు న‌వ్వుకుంటూ, మాట్లాడుకుంటూ బ‌య‌ట‌కి వ‌స్తున్న ఫొటోలో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష్య‌మ‌య్యాయి. అయితే రియాల్టీలో ఇది పాత వీడియో అని, ఇప్పుడు కూడా హర్దిక్‌, కృనాల్ పాండ్యాలు మాట్లాడుకోవడం లేదని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై కొంతమంది ఫ్యాన్స్ మాత్రం 'అసలెప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలవడానికి’ అని కామెంట్ పెట్టారు.

ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఔటైనప్పుడు కృనాల్ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు, ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత హార్దిక్ తన సోదరుడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది.

ఈ ఊహాగానాలపై కృనాల్ స్పందిస్తూ, "మేమిద్దరం కలిసే క్రికెట్ ఆడాం. ఆటలోని వ్యూహాలు, టెక్నిక్ గురించి ఎప్పుడూ చర్చించుకుంటాం. మా మధ్య ఆరోగ్యకరమైన చర్చే ఉంటుంది. ఒకే క్రీడలో ఇద్దరు సోదరులు ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. దేవుడి దయవల్ల పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం చిన్న విషయం కాదు" అని వివరించాడు. హార్దిక్ 5, తాను 5 ఐపీఎల్ టైటిళ్లు గెలిచామని తెలిపాడు.

ఇక టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెక్స్‌ (సీవోఈ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్న పాండ్యా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్‌ దృష్టిలో పెట్టుకొని పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

Read: రేపే భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. ఫెవరెట్‌గా గబ్బర్‌ సేన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement