కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు స్వర్ణాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్ పసిడి పతకాలు నెగ్గగా.. తాజాగా ఈ లిస్ట్‌లో అరుంధతి చౌదరీ కూడా చేరింది. మహిళల 70 కేజీల గోల్డ్ కైవసం చేసుకుంది. దీంతో భారతదేశ బాక్సింగ్‌లో భారత స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది.
తాజాగా మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరీ కూడా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కామన్‌వెల్త్‌లో భారత్‌కు ఇది 11వ స్వర్ణం కాగా, పతకాల సంఖ్య 34కి పెరిగింది.


