Photo Credit: BCCI Twitter
దులీప్ ట్రోఫీ 2026కు సంబంధించి సెంట్రల్ జోన్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఫినిషర్ రింకూ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోయనున్నాడు. 15 మందితో పాటు అమన్‌దీప్ ఖరె, మయాంక్ మిశ్రా, సౌరబ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయలు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఐదు టెస్టులు జరగనున్నాయి. సెంట్రల్ జోన్‌తో పాటు నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్‌తో పాటు సౌత్‌జోన్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.
అయితే ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ కూడా సెంట్రల్ జోన్‌లో చోటు లభించింది. సారాంశ్‌తో పాటు ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు జీషన్ అన్సారి, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చోటు లభించింది.
గతేడాది జరిగిన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆయేడు ఫైనల్లో సౌత్‌జోన్‌ను మట్టికరిపించిన సెంట్రల్ జోన్‌ను పటీదార్ దశాబ్ద కాలంలో తొలిసారి చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు ఆ సీజన్‌లో 382 పరుగులు చేసిన పటీదార్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. ఈసారి చాంపియన్ హోదాలో సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్ ఆడనుంది.
ఆగస్టు 23 నుంచి 26 మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్స్‌లో ఈస్ట్ జోన్‌తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్‌తో వెస్ట్‌జోన్ తలపడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్లు సెమీస్‌లో చాంపియన్ సెంట్రల్ జోన్‌తో పాటు రన్నరప్ సౌత్‌జోన్‌తో ఆడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.
సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యాష్ ఠాకూర్, నాచికేత్ భూటె
స్టాండ్ బై ప్లేయర్స్: అమన్‌దీప్ ఖరే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయ.
సపోర్ట్ స్టాఫ్: నిఖిల్ డోరు - హెడ్ కోచ్, దేశ్‌రాజ్ చౌహాన్ - ఫిజియో, చంద్రశేఖర్ రావు - వీడియో అసిస్టెంట్, మోహిత్ కుమార్ - మసీర్, మనీష్ ఝా - అసిస్ట్ కోచ్, మయాంక్ అగర్వాల్ - ట్రైనర్, జుఫ్రీ జకేరియా - మేనేజర్.
చదవండి: నీరజ్‌కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా


