breaking news
central zone
-
సెమీ ఫైనల్లో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఫెయిల్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించిన నాటి నుంచి రెండు పేర్లు చర్చనీయాంశమయ్యాయి. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో జైసూ కేవలం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైతే.. శ్రేయస్ అందుకు కూడా నోచుకోలేదు.సెమీ ఫైనల్లో ఇద్దరూ విఫలంఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ముంబైకర్లకు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. శ్రేయస్, జైసూలకు ఆసియా కప్ జట్టులో చోటు ఇవ్వాల్సిందంటూ బీసీసీఐ తీరును విమర్శించారు. ఇలా చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న ఈ ఇద్దరు.. తాజాగా దులిప్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ సందర్భంగా మైదానంలో తిరిగి అడుగుపెట్టారు.వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. దులిప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నిరాశపరిచారు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ఈ క్రమంలో హర్విక్ దేశాయ్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక హర్విక్ ఒక్క పరుగు చేసి దీపక్ చహర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు.25 పరుగులు చేసిన అయ్యర్వన్డౌన్లో వచ్చిన ఆర్య దేశాయ్ 39 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ మాత్రం నిరాశపరిచాడు. 28 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించాడు. షమ్స్ ములానీ 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనఅయితే, నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అద్భుత అర్ధ శతకం (94 నాటౌట్)తో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ నేపథ్యంలో 45 ఓవర్ల ముగిసే సరికి వెస్ట్ జోన్ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక సెంట్రల్ జోన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, దీపక్ చహర్, సారాంశ్ జైన్, హర్ష్ దూబే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్‌తో ఆడే జట్టుకు ఎంపిక అవ్వాలంటేకాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ-2025లో సత్తా చాటాలని.. శ్రేయస్ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో నిరాశజనక ప్రదర్శనతో అతడి అవకాశాలు సన్నగిల్లినట్లే. రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తే భారత టెస్టు జట్టులోకి పునరాగమనం గురించి అయ్యర్ ఆశలు పెట్టుకోవచ్చు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్టు ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు
వెస్ట్ జోన్‌తో రేపటి నుంచి (సెప్టెంబర్ 4) ప్రారంభం కాబోయే దులీప్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్‌కు ముందు సెంట్రల్ జోన్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ డెంగ్యూ కారణంగా టోర్నీ నుంచి తప్పించబడ్డాడు. జురెల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతూ కోలుకోలేకపోతున్నాడు. దీంతో సెలెక్టర్లే స్వయంగా రంగంలోని దిగి అతన్ని తప్పించారు. జురెల్‌కు ప్రత్యామ్నాయంగా విదర్భ రంజీ కెప్టెన్ అక్షయ్ వాద్కర్‌ను ప్రకటించారు.వాస్తవానికి ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జురెల్నే సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే నార్త్ఈస్ట్ జోన్‌తో మ్యాచ్ సమయానికి అతనికి జ్వరం ప్రారంభం కావడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. జురెల్ స్థానంలో రజత్ పాటిదార్ ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజాగా జురెల్ టోర్నీ మొత్తం నుంచే వైదొలగడంతో పాటిదార్ సెంట్రల్ జోన్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ తరఫున దనిశ్ మాలేవార్ (203 రిటైర్డ్ ఔట్), రజత్ పాటిదార్ (125), యశ్ రాథోడ్ (87 నాటౌట్), ఆర్యన్ జుయెల్ (60 రిటైర్డ్ హర్ట్) చెలరేగి ఆడారు.జురెల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకటించిన అక్షయ్ వాద్కర్కు వాస్తవానికి సెంట్రల్ జోన్ తొలుత ప్రకటించిన జట్టుకే ఎంపిక చేయాల్సి ఉండింది. అయితే టీమిండియాకు ఆడిన ఆటగాళ్లు అధికంగా అందుబాటులో ఉండటం చేత అప్పట్లో అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.భీకర ఫామ్‌లో ఉండిన వాద్కర్‌ను పట్టించుకోకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. చాలా మంది వాద్కర్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నించారు. వాద్కర్ తాజాగా ముగిసిన రంజీ ట్రోఫీలో విదర్భను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఆ సీజన్లో అతను 10 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 722 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపర్‌గానూ (24 డిస్మిసల్స్) సత్తా చాటాడు.తప్పుకున్న కుల్దీప్ సెమీస్‌కు ముందు సెంట్రల్ జోన్‌కు మరో షాక్ కూడా తగిలింది. క్వార్టర్ ఫైనల్లో ఆడిన కుల్దీప్ యాదవ్ టీమిండియాకు ఎంపికైన కారణంగా జట్టును నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో అప్పటికే స్టాండ్ ప్లేయర్‌గా జట్టులో ఉండిన ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఆర్సీబీ కెప్టెన్
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ దులీప్ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రజత్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) ప్రారంభమైన మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో రజత్తో పాటు మరో సెంట్రల్ జోన్ ఆటగాడు కూడా సెంచరీ చేశాడు. వన్ డౌన్లో బరిలోకి దిగిన దనిశ్ మలేవార్ 171 బంతుల్లో 25 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మలేవార్‌కు జతగా రజత్ పాటిదార్ 111 పరుగుల వద్ద (85 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నాడు.టీ విరామం సమయానికి సెంట్రల్ జోన్ స్కోర్ వికెట్ నష్టానికి 314 పరుగులుగా (61 ఓవర్లలో) ఉంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-బిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి సెంట్రల్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నార్త్ ఈస్ట్ జోన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ ఆయుశ్ పాండే 3 పరుగులకే ఔటయ్యాడు. ఆకాశ్ చౌదరీ బౌలింగ్‌లో హేమ్ ఛెత్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆయుశ్ పాండే ఔటయ్యాక సెంట్రల్ జోన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. మరో ఓపెనర్ ఆర్యన్ జుయల్ 60 పరుగుల వద్ద అనుకోకుండా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన రజత్ పాటిదార్ టీ20లకు తలపిస్తూ షాట్లు ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో మలేవార్ కూడా వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ సెంట్రల్ జోన్‌ను ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంచారు. ఈ మ్యాచ్ గెలిస్తే సెంట్రల్ జోన్ సెమీస్‌కు చేరుతుంది. -
టీమిండియా స్టార్ వికెట్ కీపర్‌కు ప్రమోషన్.. ఆ జట్టు కెప్టెన్‌గా
దులీప్ ట్రోఫీ-2025లో తలపడే సెంట్రల్ జోన్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, యూపీ స్టార్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ 15 మంది సభ్యుల జట్టులో అంతర్జాతీయ క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్, దీపక్ చాహర్, రజిత్ పాటిదార్ ఉన్నారు.కాగా ఈ జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నప్పటికి ఈ టోర్నీలో ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. అతడు ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. టోర్నీ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తే తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. లేదంటే ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.ఒకవేళ అతడు ఫిట్‌గా ఉంటే జురెల్ స్ధానంలో కెప్టెన్‌గా ఎంపికయ్యే వాడు. ఆర్సీబీకి తొలి టైటిల్‌ను అందించిన పాటిదార్.. గత రంజీ సీజన్లో దమ్ములేపాడు. 11 ఇన్నింగ్స్‌లలో 48 సగటుతో 529 పరుగులు చేశాడు. మరోవైపు జురెల్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.పంత్ స్ధానంలో..అయితే ధ్రువ్ జురెల్ ఇటీవలే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని సమం చేసిన భారత జట్టు భాగంగా ఉన్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కు పరిమితమైన జురెల్.. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో మాత్రం ఆడాడు. రిషబ్ పంత్ గాయపడడంతో జురెల్‌కు ఛాన్స్ లభించింది. ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేసి జురెల్ పర్వాలేదన్పించాడు.వికెట్ల వెనక చురుగ్గా కదులుతూ భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. నార్త్ జోన్ కెప్టెన్‌గా టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. ఈ దేశవాళీ టోర్నీ ఆగస్టు 28న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడనుంది.సెంట్రల్ జోన్ జట్టు ఇదే: ధ్రువ్ జురెల్(కెప్టెన్), రజత్ పాటిదార్*, ఆర్యన్ జుయల్, డానిష్ మలేవార్, సంచిత్ దేశాయ్, కుల్దీప్ యాదవ్, ఆదిత్య ఠాకరే, దీపక్ చాహర్, సరాంశ్ జైన్, ఆయుష్ పాండే, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, మానవ్ సుత్మేద్, మానవ్ సుత్మేద్స్టాండ్బై ఆటగాళ్లు: మాధవ్ కౌశిక్, యశ్ ఠాకూర్, యువరాజ్ చౌదరి, మహిపాల్ లోమ్రోర్, కుల్దీప్ సేన్, ఉపేంద్ర యాదవ్. -
టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. కీలక టోర్నీకి దూరం?
దులీప్ ట్రోఫీ-2025కు ముందు సెంట్రల్ జోన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వెటరన్, విధర్బ స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ గాయం కారణంగా ఈ ఏడాది దులీప్ ట్రోఫీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో నాయర్ చేతి వేలికి స్వల్ప గాయమైంది. దీంతో వైద్యుల సూచన మేరకు ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉండాలని కరుణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ సిరీస్‌లో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ నాయర్ దులీప్ ట్రోఫీలో ఆడి మెరుగ్గా రాణించింటే భారత టెస్టు జట్టులో తన స్ధానం పదిలంగా ఉండేది. కానీ ఇప్పుడు గాయం బారిన పడడంతో జట్టులో అతడి స్ధానానికి గ్యారంటీ లేదు. స్వదేశంలో వెస్టిండీస్,దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లకు నాయర్‌ను సెలక్టర్లు పక్కన పెట్టే అవకాశముంది."ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఓ బంతి కరుణ్ నాయర్ చేతివేలికి తాకింది. వెంటనే చిన్నగా వాపు కూడా వచ్చింది. దీంతో రాబోయే దులీప్ ట్రోఫీలో నాయర్ సెంట్రల్ జోన్ తరపున అతడు ఆడడు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత టెస్టు జట్టులో కరుణ్ నాయర్ స్దానాన్ని మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో భర్తీ చేసే అవకాశముంది. కాగా దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్‌లు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 15 వరకు జరగనున్నాయి.దులీప్ ట్రోఫీ-2025 షెడ్యూల్👉ఆగష్టు 28- 31: తొలి క్వార్టర్ ఫైనల్- నార్త్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్👉ఆగష్టు 28- 31: రెండో క్వార్టర్ ఫైనల్- సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్👉సౌత్ జోన్ (తొలి సెమీస్), వెస్ట్ జోన్ (రెండో సెమీస్) ఇప్పటికే సెమీ ఫైనల్ చేరగా.. సెప్టెంబరు 4-7 వరకు సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి👉సెప్టెంబరు 11- 15: ఫైనల్.దులిప్ ట్రోఫీ-2025లో తలపడే వెస్ట్‌జోన్ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనుష్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నాగ్వాస్వలా.సౌత్ జోన్ జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), మొహమ్మద్ అజహరుద్దీన్, తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలె, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాణ విజయ్, సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎండీ ని«దీశ్, రికీ భుయ్, బాసిల్, గుర్జపనీత్ సింగ్, స్నేహల్ కౌథాంకర్. స్టాండ్‌బై: మోహిత్ రెడ్కర్, స్మరణ్, అంకిత్ శర్మ, యాపిల్ టామ్, సిద్ధార్థ్, షేక్ రషీద్ -
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారాకు మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్‌ను అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో నోటెడ్ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
11 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్.. సెమీస్‌లో నార్త్, సెంట్రల్ జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో సౌత్ జోన్‌తో నార్త్ జోన్; వెస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడతాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్ కుమార్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో సెంట్రల్ జోన్, నార్త్‌జోన్ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న పోరులో సెంట్రల్ ఆటగాళ్లు హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించగా, సౌరభ్ కుమార్ (4/33) స్పిన్ బౌలింగ్‌తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్‌సింగ్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈస్ట్‌జోన్ సౌరభ్ స్పిన్ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. నార్త్ ఆల్‌రౌండ్ దెబ్బకు... నార్త్‌జోన్ ఆల్‌రౌండ్ దెబ్బకు నార్త్ ఈస్ట్‌జోన్ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్ ఈస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్ ఈస్ట్‌జోన్ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో నార్త్‌కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను నార్త్‌జోన్ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రభ్ సిమ్రన్‌సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్ ఈస్ట్‌జోన్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. -
నిశాంత్, హర్షిత్ సెంచరీలు.. ప్రత్యర్థి జట్టుకు తప్పని తిప్పలు
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. నిశాంత్ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్షిత్ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్‌తో కలిసి హర్షిత్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు... సిద్ధార్థ్ కౌల్ (9 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్‌కు ఆధిక్యం ఈస్ట్ జోన్ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్‌గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది. -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్‌ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు. -
తండ్రి ఎస్సై..కొడుకు 18 కేసుల్లో నిందితుడు
సాక్షి, రాంగోపాల్‌పేట్: పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసి పోలీసునంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు సోమవారం వివరాలు వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు సృజన్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం మన్ననూర్లోని 4వ బెటాలియన్‌లో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 7న సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని బతుకమ్మ ఘాట్‌వద్ద ఓ జంట కారు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సృజన్‌కుమార్ తాను టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారినంటూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని వారిని బెదిరించాడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డు చూపించి వెంటనే తనకు కొంత డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో కేసు పెడతానని బెదిరించాడు. అంతేగాక వారిని కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్–1 లోని కమల్ వాచ్ షోరూమ్‌కు తీసుకుని వెళ్లాడు. అక్కడ రూ.5800 విలువైన వాచ్‌ని కొనుగోలు చేసి బాధితులచే బిల్లు కట్టించాడు. అనంతరం వారిని నేరుగా నెక్లెస్‌రోడ్‌కు తీసుకువచ్చి అక్కడ పార్కు చేసిన తన బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై బాధితులు రాంగోపాల్‌పేట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి ఆపిల్ రిస్ట్ వాచ్, బీఫిట్ లింక్ బీకే వాచ్, ఆక్టివా వాహనం, రెండు ఆపిల్ ఫోన్లు, పోలీసు గుర్తింపు కార్డు, ఐపాడ్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో బెదిరింపులు.. నిందితుడి తండ్రి ఎస్సైగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. జల్సాలకు అలవాటు పడిన సృజన్ కుమార్ 10వ తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. 2007 నుంచి మోసాలకు పాల్పడుతున్న ఇతడిపై తెలంగాణాలో 14 కేసులు, ఏపీలో 4 కేసులు ఉన్నాయి. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై నాన్‌బెయిల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఏపీలో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లిన సృజన్‌కుమార్ ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చిడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డుతో, బైక్‌పై పోలీస్ స్టిక్కర్‌తో తిరుగుతూ అమాయకులను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నాడు. అంతేగాక అతను ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది) -
సెంట్రల్ జోన్ విజేతగా ’పశ్చిమ’
ఏలూరు రూరల్ : జిల్లా బాలికల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ నెల 8 నుంచి 15 వరకూ గుంటూరు ఏసీఏలో జరిగిన అండర్19 సెంట్రల్‌జోన్ పోటీల్లో విజేతగా నిలిచింది. 9 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జట్లపై వరుసగా గెలిచింది. జట్టు క్రీడాకారిణిలు కె హెప్సిబా, జి సత్యవేణి, ఎం లావణ్య, టి ఉమాదేవి బ్యాటింగ్‌లో రాణించగా ఎస్ శైలజ, జి నవ్యదుర్గ, ఈ తేజస్వి బౌలింగ్ విభాగంలో రాణించారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జిల్లా క్రీడాకారులు జి నవ్యదుర్గ, జి సత్యవేణి, టి ఉమాదేవి, ఎం లావణ్య, కె హెప్సిబా, ఎస్ శైలజ, ఈ తేజస్వి, ఎస్ మంజుల సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికయ్యారని అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్ వివరించారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎస్ రమాదేవి వ్యవహరించనున్నారని తెలిపారు. జట్టు సభ్యులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. -
ముగిసిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : నగరంలోని కొత్తూరు ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈ నెల 13 నుంచి జరిగిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయి. బాలుర సీనియర్ ఓవరాల్ చాంపియన్‌గా 11 పాయింట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (అనంతపురం), కేసీజీహెచ్‌ఎస్ (కళ్యాణదుర్గం) జట్లు నిలిచాయి. బాలుర జూనియర్ ఓవరాల్ చాంపియన్‌గా 15 పాయింట్లతో కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం జట్టు నిలిచింది. సీనియర్ బాలికల ఓవరాల్ చాంపియన్‌గా 11 పాయింట్లతో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పెనుకొండ జట్టు నిలిచింది. జూనియర్ బాలికల ఓవరాల్ చాంపియన్‌గా 5 పాయింట్లతో కేజీబీవీ బెళుగుప్ప, జెడ్పీ ఉన్నత పాఠశాల తురకలాపట్నం, కేజీబీవీ రాప్తాడు, కేజీబీవీ మాలాపురం, జెడ్పీ ఉన్నత పాఠశాల ముదిరెడ్డిపల్లి జట్లు నిలిచాయి. సీనియర్ స్పోర్ట్స్ (క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్) బాలుర సీనియర్ విభాగంలో కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం పాఠశాల నిలిచింది. బాలుర జూనియర్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల శ్రీరంగరాజుపల్లి, జెడ్పీ ఉన్నత పాఠశాల నల్లమాడ జట్లు నిలిచాయి. బాలికల సీనియర్, జూనియర్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల నింబగల్లు జట్టు నిలిచింది. - ఇండివిజువల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో బాలుర సీనియర్ విభాగంలో రఘునందన్ (కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం) నిలిచాడు. జూనియర్ బాలుర విభాగంలో : జీవన్ (జెడ్పీ ఉన్నత పాఠశాల శ్రీరంగరాజుపల్లి). సీనియర్ బాలికల విభాగంలో : దీప్తి (జెడ్పీ ఉన్నత పాఠశాల చల్లపల్లి) జూనియర్ బాలికల విభాగంలో : ధనలక్ష్మీ (జెడ్పీ ఉన్నత పాఠశాల నింబగల్లు) క్రీడలతో ఆరోగ్యం ప్రతిరోజూ క్రీడల్లో పాల్గోనడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎస్డీఓ బాషామొహిద్దీన్ తెలిపారు. సెంట్రల్ జోన్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యకళలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే వారు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఏడీఎస్ఎస్ఏఏ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, శంకరన్న, వేణుగోపాల్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ కార్యదర్శి గోపాల్, లింగమయ్య, నాగరాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ జోన్‌కు వీఆర్ఎస్ కళాశాల
చీరాలటౌన్: స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సౌత్ జోన్ క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రెండో రోజు మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన చీరాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఒంగోలు గీతం డిగ్రీ కళాశాల జట్టు 18 ఓవర్లకే ఆల్అవుట్ అయి కేవలం 68 పరుగులు సాధించి ఓటమి చెందింది. దీంతో సెంట్రల్ జోన్‌కు వీఆర్ఎస్ జట్టు స్థానం సాధించింది. బుధవారం గుంటూరు హిందూ కళాశాల జట్టు, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చిమటా సుబ్బారావు తెలిపారు. వీఆర్ఎస్ జట్టులో నరేష్, నాగేంద్ర, అజయ్ చక్కని ప్రతిభచూపి జట్టు విజయానికి కృషి చేశారు. సెంట్రల్ జోన్‌కు అర్హత సాధించిన వీఆర్ఎస్ జట్టును కళాశాల ప్రిన్సిపాల్ బాల సుబ్బారావు, అధ్యాపకులు జాగర్లమూడి దేవి అభినందించారు. -
దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్
ముంబై: దేశవాళీ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 116 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన సెంట్రల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (105 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. కరుణ్ నాయర్ (62 బంతుల్లో 9 ఫోర్లతో 77)తో కలిసి అపరాజిత్ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జత చేశాడు. సెంట్రల్ జట్టులో పంకజ్‌సింగ్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 36.3 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అర్జిత్ గుప్తా (49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66) మినహా అందరూ విఫలమయ్యారు. సౌత్ కెప్టెన్ వినయ్ కుమార్ 8 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. సోమవారం జరిగే సెమీఫైనల్లో సౌత్‌జోన్ జట్టు వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. ఆదివారం (నేడు) జరిగే సెమీస్‌లో ఈస్ట్‌తో నార్త్ తలపడుతుంది. -
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్
చెన్నై: బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సౌత్‌జోన్... దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా (6/48) కీలక వికెట్లు తీయడంతో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 258 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 57.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా ఓజా నాలుగు ఓవర్ల వ్యవధిలో రాబిన్ బిస్త్ (20), శలభ్ శ్రీవాస్తవ (2), నమన్ ఓజా (0)లను అవుట్ చేయడంతో సౌత్ విజయం ఖరారైంది. అంతకుముందు 467/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సౌత్ జట్టు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. -
సెంట్రల్ జోన్ 209 ఆలౌట్
చెన్నై: సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. పీయూష్ చావ్లా (56) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిథున్, ఓజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 2 వికెట్లకు 137 పరుగులు చేసింది. ముకుంద్ (61), అపరాజిత్ (35) క్రీజులో ఉన్నారు. ఉన్ముక్త్ సెంచరీ: కొచ్చిలో ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో నార్త్‌జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఉన్ముక్త్ చంద్ (116), ఇయాన్ దేవ్‌సింగ్ (95 రిటైర్డ్‌హర్ట్) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 2 వికెట్లకు 329 పరుగులు చేసింది. -
సెంట్రల్ జోన్ 123/5 : దులీప్ ట్రోఫీ
చెన్నై: సౌత్ జోన్ పేసర్ అభిమన్యు మిథున్ (3/24) పదునైన బంతులతో రెచ్చిపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సెంట్రల్ జోన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 123 పరుగులు చేసింది. వర్షం కారణంగా పూర్తి స్థాయి ఓవర్లు ఆడేందుకు వీలు పడలేదు. మూడో ఓవర్ నుంచే మిథున్ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. దీంతో 13 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన సెంట్రల్‌ను ఓపెనర్ ముకుల్ దాగర్ (105 బంతుల్లో 45; 6 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకున్నాడు. బిస్త్ (18)తో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. తనను కూడా మిథున్ పెవిలియన్‌కు చేర్చడంతో సెంట్రల్ కష్టాల్లో పడింది. నార్త్ జోన్ 33/0 కొచ్చి: మరో సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకిగా నిలి చింది. దీంతో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ 4 రోజుల మ్యాచ్‌లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్ నిదానంగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేయగలిగింది. క్రీజులో జీవన్‌జ్యోత్ (18), ఉన్ముక్త్ చంద్ (12) ఉన్నారు.