దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్ | Southzone in Devadhar semi final | Sakshi
Sakshi News home page

దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్

Nov 30 2014 12:45 AM | Updated on Sep 2 2017 5:21 PM

దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్

దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్

దేశవాళీ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 116 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసింది.

ముంబై: దేశవాళీ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 116 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన సెంట్రల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (105 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు.

కరుణ్ నాయర్ (62 బంతుల్లో 9 ఫోర్లతో 77)తో కలిసి అపరాజిత్ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జత చేశాడు. సెంట్రల్ జట్టులో పంకజ్‌సింగ్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 36.3 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అర్జిత్ గుప్తా (49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66) మినహా అందరూ విఫలమయ్యారు. సౌత్ కెప్టెన్ వినయ్ కుమార్ 8 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. సోమవారం జరిగే సెమీఫైనల్లో సౌత్‌జోన్ జట్టు వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. ఆదివారం (నేడు) జరిగే సెమీస్‌లో ఈస్ట్‌తో నార్త్ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement