
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో దుమ్ములేపిన సౌత్ జోన్.. తుది పోరులో మాత్రం తడబడుతోంది. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 63 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది.
కుమార్ కార్తికేయ, శరన్ష్ జైన్ స్పిన్ వలలలో చిక్కుకుని సౌత్ జోన్ బ్యాటర్లు విలవిల్లాడారు. శరన్ష్ జైన్ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు.
మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సౌత్ జోన్ జట్టులో నారయణ్ జగదీశన్, దేవ్‌దత్ పడిక్కల్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక కావడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో భాగం కాలేదు. కాగా సెమీఫైనల్లో జగదీశన్ భారీ సెంచరీతో కదం తొక్కగా.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బ్యాటింగ్‌లో విఫలమైన సౌత్ జోన్ కనీసం బౌలింగ్‌లో నైనా రాణిస్తుందో లేదో వేచి చూడాలి.
చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు'