
దులీప్ ట్రోఫీ-2025లో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో సెంట్రల్ జోన్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. క్రీజులో యష్ రాథోడ్(137), శరన్ష్ జైన్ ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 118 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
సెంట్రల్ జోన్ వికెట్ల పడగొట్టడానికి సౌత్ జోన్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ కెప్టెన్, ఆర్సీబీ సారథి రజత పాటిదార్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 50/0 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన సెంట్రల్ జోన్ ఆరంభంలోనే అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20, 3 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది.
ఆ తర్వాత సెంట్రల్ జోన్ శుబ్‌మ్ శర్మ(6), డానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) వికెట్లను రెండు ఓవర్ల వ్యవధిలోనే కోల్పోయింది. ఈ సమయంలో పాటిదార్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాటిదార్.. కేవలం 112 బంతుల్లోనే తన 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అంతేకాకుండా యష్ రాథోడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు నెలకొల్పాడు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ మూడు, నిదేశ్, కౌశిక్ తలా వికెట్ సాధించారు. సెంట్రల్ జోన్ ప్రస్తుతం 235 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
టీమిండియాలోకి రీ ఎంట్రీ?
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాటిదార్ సూపర్ సెంచరీతో సెలక్టర్లకు సవాలు విసిరాడు. ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో పాటిదార్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచాడు. గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్నప్పటికి పాటిదార్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకులోదు.
దులీప్ ట్రోఫీలో కూడా పాటిదార్ దుమ్ములేపుతున్నాడు. ఒకవేళ దులీప్ ట్రోఫీలో ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాటిదార్ ఎంపికయ్యే అవకాశముంది. ఇప్పటికే టీమిండియా టెస్టుల్లో అరంగేట్రం చేసిన పాటిదార్ తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడి రీ ఎంట్రీ కష్టమే అనే చెప్పాలి.
చదవండి: రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె