రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్‌తో సంజూ (PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్‌కు ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అట్టిపెట్టుకునే, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు.. వేలానికి సన్నద్ధమయ్యాయి. ఖరీదు అనుకున్న ఆటగాళ్లను ఆక్షన్‌లోకి వదిలి.. తిరిగి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కొన్ని ఫ్రాంఛైజీలు భావిస్తుండగా.. భారం అనుకున్న ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంఛైజీలు ట్రేడ్ చేసుకున్నాయి.
జడ్డూకు బదులుగా సంజూ
ఇక ట్రేడింగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన ఒప్పందం హైలైట్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్‌కు ఇచ్చేసిన సీఎస్‌కే.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించింది. సంజూ రిటైన్ ధర రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ నుంచి అతడిని చెన్నై ట్రేడ్ చేసుకుంది.
రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటు
ఈ నేపథ్యంలో సంజూకు సీఎస్‌కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగగా.. చెన్నై మాత్రం రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటు వేసింది. రిటెన్షన్, రిలీజ్ జాబితా విడుదల చేసిన వెంటనే రుతును తమ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా అదే బాటలో నడువగా.. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు కూడా తమ పాత కెప్టెన్లనే 2026లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
ఇంకా సారథిని ప్రకటించని ఆ రెండు జట్లు
అయితే, కెప్టెన్ సంజూను సీఎస్‌కేకు ట్రేడ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ మాత్రం కొత్త సారథి పేరును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్‌గా అజింక్య రహానేను కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం గురించి స్పష్టతనివ్వలేదు. కాగా డిసెంబరు 16న అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం జరుగనుంది.
ఐపీఎల్-2026లో జట్ల కెప్టెన్లు వీరే
👑చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్
👑సన్‌రైజర్స్ హైదరాబాద్- ప్యాట్ కమిన్స్
👑గుజరాత్ టైటాన్స్- శుబ్‌మన్ గిల్
👑లక్నో సూపర్ జెయింట్స్- రిషభ్ పంత్
👑రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రజత్ పాటిదార్
👑ఢిల్లీ క్యాపిటల్స్- అక్షర్ పటేల్
👑పంజాబ్ కింగ్స్- శ్రేయస్ అయ్యర్
👑ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా.
చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే


