టి20 ప్రపంచకప్‌నకు ఆ్రస్టేలియా జట్టు
మెల్‌బోర్న్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగే ఆసీస్ బృందానికి మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ఉపఖండంలో వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో... జట్టు ఎంపికలో స్పిన్నర్లకు పెద్దపీట వేశారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్యాట్ కమిన్స్, జోష్ హాజల్‌వుడ్, టిమ్ డేవిడ్‌లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
వరల్డ్‌కప్ సమయానికి వీరు ఫిట్‌నెస్ సాధిస్తారని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే ఆడని స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టి20లకు వీడ్కోలు పలకడంతో... కూపర్ కొనొల్లీకి జట్టులో చోటు దక్కింది. ఆసీస్ ఆడిన గత 12 టి20 మ్యాచ్‌ల్లో ఆడని కొనొల్లీ ఎంపిక ఒక్కటే ఆశ్యర్చ పరిచే నిర్ణయం! గ్రీన్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మ్యాక్స్‌వెల్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.
ఈ జట్టులో మార్పు చేర్పులకు ఈ నెల 31 వరకు ఐసీసీ అవకాశం కలి్పంచింది. ఐర్లాండ్, ఒమాన్, శ్రీలంక, జింబాబ్వేలతో కలిసి ఆ్రస్టేలియా గ్రూప్ ‘బి’లో పోటీ పడనుంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆసీస్ తొలి మ్యాచ్‌ఆడనుంది. ఆ తర్వాత 13న జింబాబ్వేతో, 16న శ్రీలంకతో, 20న ఒమాన్‌తో తలపడుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది టి20 ప్రపంచ కప్‌లు జరగగా... అందులో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి సార్లు ట్రోఫీ దక్కించుకున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌తో ఆ్రస్టేలియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది.
ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెపె్టన్), హెడ్, ఇన్‌గ్లిస్, జేవియర్, కూపర్ కొనొల్లీ, కమిన్స్, టిమ్ డేవిడ్, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, నాథన్ ఎలీస్, హాజల్‌వుడ్, కునేమన్, షార్ట్, జంపా.


