వెంకటేశ్ అయ్యర్ (PC: KKR/IPL)
ఐపీఎల్-2026 వేలానికి ముందు తాము విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా (IPL 2026 Release List)ను పది ఫ్రాంఛైజీలు శనివారం విడుదల చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ మతీశ పతిరణ (రూ. 13 కోట్లు)ను వదిలించుకోవడం.. ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ (రూ. 9 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు), పంజాబ్ కింగ్స్ గ్లెన్ మాక్స్‌వెల్ (రూ. 4.2 కోట్లు) విడుదల చేయడం హైలైట్‌గా నిలిచాయి.
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer- రూ. 23.75 కోట్లు)ను రిలీజ్ చేయడం వీటన్నింటికంటే ప్రాధాన్యం సంతరించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్టు
మతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్‌కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే
లియామ్ లివింగ్‌స్టోన్, లుంగి ఎంగిడి, మయాంక్ అగర్వాల్, టిమ్ సీఫర్ట్, బ్లెస్సింగ్ ముజర్‌బానీ, మనోజ్ భండాగే, మోహిత్ రాఠీ, స్వస్తిక్ చికారా.
ముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లు
రీస్ టాప్లీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు, లిజాడ్ విలియమ్స్, అర్జున్ టెండుల్కర్ (ట్రేడింగ్), కర్ణ్ శర్మ, బెవాన్ జేకబ్స్, కేఎల్ శ్రీజిత్.
రాజస్తాన్ రాయల్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు
వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, ఫజల్‌హక్ ఫారూకీ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ, సంజూ శాంసన్ (ట్రేడింగ్), నితీశ్ రాణా
ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ లిస్టు
ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెగర్క్, మోహిత్ శర్మ, డొనొవాన్ ఫెరీరా, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కాండే, హ్యారీ బ్రూక్.
పంజాబ్ కింగ్స్ వదిలేసిన ప్లేయర్లు
గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, ప్రవీణ్ దూబే, కుల్దీప్ సేన్, జోష్ ఇంగ్లిస్
గుజరాత్ టైటాన్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు
కరీం జనత్, గెరాల్డ్ కోయెట్జి, దసున్ షనక, మహిపాల్ లామ్రోర్, కుల్వంత్ ఖెజ్రోలియా, షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (ట్రేడింగ్)
సన్‌రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన ఆటగాళ్లు
రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా, సిమర్జీత్ సింగ్, వియాన్ ముల్దర్, అథర్వ టైడే, సచిన్ బేబి, మొహమ్మద్ షమీ (ట్రేడింగ్).
లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ లిస్టు
రవి బిష్ణోయి, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమార్ జోసెఫ్,ఆర్యన్ జుయాల్, యువరాజ్ చౌదరి, రాజ్‌వర్థన్ హంగ్రేర్కర్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడింగ్)
కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ లిస్టు
వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, క్వింటన్ డికాక్, స్పెన్సర్ జాన్సన్, రహ్మానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నోర్జే, మొయిన్ అలీ, చేతన్ సకారియా, లవనిత్ సిసోడియా, మయాంక్ మార్కండే.
చదవండి: IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు


