హర్మన్‌ప్రీత్‌ మెరుపులు.. శ్రీలంక టార్గెట్‌ ఎంతంటే..? | INDW VS SLW 5th T20I: sri lanka restricted team india to 175 runs | Sakshi
Sakshi News home page

హర్మన్‌ప్రీత్‌ మెరుపులు.. శ్రీలంక టార్గెట్‌ ఎంతంటే..?

Dec 30 2025 8:43 PM | Updated on Dec 30 2025 8:43 PM

INDW VS SLW 5th T20I: sri lanka restricted team india to 175 runs

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు.

మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్‌ కమలిని 12, హర్లీన్‌ డియోల్‌ 13, రిచా ఘోష్‌ 5, దీప్తి శర్మ 7, స్నేహ్‌ రాణా (8 నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్‌ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్‌ పడగొట్టింది.

కాగా, స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement