
దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్, టీమిండియా ఆటగాడు రజత్ పాటిదార్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాటిదార్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
పాటిదార్ 330 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో తొలి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 107 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ ఆర్సీబీ కెప్టెన్.. ఆచితూచి ఆడుతూ మూడంకెల ఫిగర్‌ను సాధించాడు.
ఇప్పటివరకు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 196గా ఉండేది. ఈ ఎంపీ కెప్టెన్ 203 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడి ద్విశతకం ఫలితంగా మధ్యప్రదేశ్ జట్టు 145 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 489 పరుగులు చేసింది. ఎంపీ టీమ్ ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?
ఇటీవల కాంలో పటిదార్ దుమ్ములేపుతున్నాడు. గత 8 ఇన్నింగ్స్‌ల్లో అతడు సాధించిన స్కోర్లు ఇవే 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 203*(332). పాటిదార్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
పాటిదార్ గతేడాది ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకోలేకపోయాడు. భారత్ తరపున మూడు టెస్టుల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి టీమిండియాలోకి తిరిగి రావాలని పట్టుదలతో పాటిదార్ ఉన్నాడు.
చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?