భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసేందుకు శర్వశక్తుల ప్రయత్నిస్తున్నాడు. షమీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు సవాల్ విసిరేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ ఆడనున్నాడు.
ఇప్పటికే తన నిర్ణయాన్ని బెంగాల్ క్రికెట్ అసోయేషిన్‌కు షమీ తెలియజేసినట్లు రేవ్ స్పోర్ట్స్ తమ కథనంలో పేర్కొంది. మహ్మద్ షమీ భారత తరపున చివరగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
ఆసియాకప్‌తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌లకు షమీని సెలక్టర్లు పక్కన పెట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరగుతున్న టెస్టు సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి తనను పట్టించుకోకపోవడం పట్ల షమీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.
కావాలనే ఎంపిక చేయడం లేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ పరోక్షంగా విమర్శించాడు. అగార్కర్ మాత్రం ఫిట్ నెస్ సమస్యల కారణంగానే షమీని ఎంపిక చేయడం లేదని మరోసారి స్పష్టం చేశాడు.
రంజీల్లో అదుర్స్..
ప్రస్తుత రంజీ సీజన్‌లో ఇప్పటివరకు బెంగాల్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడిన షమీ.. 20 వికెట్లు పడగొట్టాడు. అతడు అద్భుత ప్రదర్శన కారణంగా బెంగాల్ జట్టు గ్రూప్-సిలో అగ్రస్ధానంలో ఉంది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌లో షమీ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రూ.10 కోట్లకు లక్నో ట్రేడ్ చేసుకుంది.
చదవండి: గంభీర్ మాస్టర్ ప్లాన్‌తో వాళ్లకు చెక్!.. ఎవరీ మిస్టరీ స్పిన్నర్?


