వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ(నవంబర్ 20, 2025) హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో నగరంలో కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్టుకు భారీ తరలి వచ్చిన అభిమానులు జననేతకు ఘన స్వాగతం పలికారు. ఆయనతో కరచలనం చేసేందుకు.. ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఆ అభిమానానికి ముగ్ధుడైన ఆయన అప్యాయ అభివాదం చేశారు. ఆపై ఆయన కాన్వాయ్ వెంట ఆ అభిమానం అలా ముందుకు సాగింది.


