ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య నో హ్యాండ్ షేక్ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఈ టోర్నీలో పాక్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ టీమిండియా అంటిముట్టనట్టుగానే వ్యవహరించింది.
ఆ తర్వాత మహిళల ప్రపంచకప్‌లో సైతం మన అమ్మాయిల జట్టు కూడా పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విముఖత చూపించారు. కానీ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇందుకు విరుద్దంగా ప్రవర్తించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.
ఈ టోర్నీలో భాగంగా గురువారం అబుదాబి వేదికగా ఆస్పిన్ స్టాలియన్స్, నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం హర్భజన్.. నార్తర్న్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాకిస్తాన్ బౌలర్ షాహనవాజ్ దహానీతో కరచాలనం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
దీంతో నెటిజన్లు అతడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌లో జరిగిన 'వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్'లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లను యువరాజ్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ బాయ్‌కాట్ చేసింది. ఇండియా లెజెండ్స్ జట్టులో భజ్జీ కూడా సభ్యునిగా ఉన్నాడు.
చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?
Harbhajan Singh handshake with Shahnawaz Dahani. Ab kahan gai patriotism indians ki. #AbuDhabiT10 @iihtishamm pic.twitter.com/4ZFfgP2ld3
— Ather (@Atherr_official) November 19, 2025


