భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్–ఇన్‌ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత మళ్లీ కలవనున్నారని తెలుస్తుంది. ‘ది 50’ అనే రియాలిటీ షోలో ఇద్దరూ జంటగా ఒకే వేదికపై కనిపించబోతున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. సోషల్‌మీడియా కోడై కూస్తుంది.
‘ది 50’ షోలో చహల్, ధనశ్రీ పేర్లు టెంటేటివ్ లైనప్‌లో ఉన్నాయని సమాచారం. ఈ షోలో ఒర్రీ, ఎమివే బంటై, నిక్కీ తంబోలి, శ్వేతా తివారి, అంకితా లోఖండే, శివ్ ఠాకరే, కుషా కపిలా, శ్రీశాంత్, ఊర్ఫీ జావేద్, తాన్యా మిట్టల్, ఫైసల్ షేక్ వంటి ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.
ఒకవేళ ది 50 షోలో చహల్, ధనశ్రీ కనిపిస్తే విడాకుల తర్వాత ఈ ఇద్దరు పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై కలిసి కనిపించడం మొదటిసారి అవుతుంది.
చహల్, ధనశ్రీ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆతర్వాత కొద్దికాలం పాటు వీరి వివాహ బంధం సజావుగా సాగింది. కలిసి ఉన్నంతకాలం వీరు అనునిత్యం సోషల్‌మీడియాలో ఉండేవారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ వీరిద్దరు విడాకులకు అప్లై చేశారు. 18 నెలలు వేర్వేరుగా నివసించిన తర్వాత 2025లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. బాంద్రా ఫ్యామిలీ కోర్టు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించినట్లు సమాచారం.
విడాకుల తర్వాత వీరిద్దరి మధ్య కొంతకాలం పాటు సోషల్‌మీడియా వార్ జరిగింది. ఒకరి వ్యాఖ్యలకు ఒకరు కౌంటర్లిస్తూ పోయారు. ఈ క్రమంలో చహల్ RJ మహ్వష్‌తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ పబ్లిక్‌లో కనిపించడం, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహ్వష్ చహల్‌కు సపోర్ట్ చేయడం ఈ రూమర్స్‌కు బలం చేకూరుస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ధనశ్రీ వర్మ-చహల్ ఒకే వేదికపై జంటగా కలిసిన తర్వాత, మనసుల మార్చుకొని తిరిగి ఒకటైతే ఆర్జే మహ్‌వశ్ పరిస్థితి ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ధనశ్రీతో విడాకుల తర్వాత చహల్ మహ్‌వశ్‌తో చట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఇప్పుడు మాజీ భార్య మళ్లీ దగ్గరైతే మహ్‌వశ్ ఏం చేస్తుంది..? ఈ అంశంపై సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.


