breaking news
Dhanashree Verma
-
హ్యాట్సాఫ్: రోహిత్ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి (Devisha Shetty)ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) మాజీ భార్య ధనశ్రీ వర్మకు మద్దతు తెలుపుతూ ఓ షార్ట్ వీడియోను దేవిశా షేర్ చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.ఈ ఏడాది విడాకులు మంజూరుఅసలేం జరిగిందంటే.. కొరియోగ్రాఫర్, నటి అయిన ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్ 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే వైవాహిక బంధంలో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉంటున్న ఈ జంటకు.. ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి.చహల్ స్పందన ఇదిఈ విషయం గురించి చహల్ స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించినా.. విడిపోక తప్పలేదంటూ ధనశ్రీని పరోక్షంగా విమర్శించాడు. ఇక విడాకులకు ముందే ఆర్జే మహ్వశ్తో కలిసి ట్రిప్పులకు వెళ్లిన చహల్.. ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తమ మధ్య ప్రేమ లేదని చెప్పాడు.ఇదిలా ఉంటే.. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల తీర్పు కోసం వెళ్లిన సమయంలో చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కొటేషన్ ఉన్న కస్టమైజ్డ్ టీ షర్టు వేసుకున్నాడు. దీనర్థం.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’. దీనిని బట్టి ధనశ్రీ భరణం అడుగుతున్న కారణంగానే చహల్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేశారు.‘గోల్డ్ డిగ్గర్’ పోస్టుకు లైక్ కొట్టిన రితికామరోవైపు.. చహల్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్వశ్ సైతం.. ధనశ్రీని నిందించేలా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి అదే సమయంలో పోస్ట్ పెట్టింది. ఇంకోవైపు.. జర్నలిస్టు శుభంకర్ మిశ్రా ధనశ్రీని ‘గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే మహిళ)’ అంటూ అసభ్యకర రీతిలో విమర్శించాడు.ఇందుకు.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ కొట్టి.. పరోక్షంగా ధనశ్రీపై ఆ జర్నలిస్టులాగే నిందలు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధనశ్రీ వర్మ తన విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడింది.గట్టిగా ఏడ్చేశాతన జీవిత భాగస్వామి కోసం చేయాల్సినవన్నీ చేశానని.. అయితే, అతడే ముందుగా వైవాహిక బంధం నుంచి వైదొలిగాడని ధనశ్రీ తెలిపింది. అంతేకాదు.. తనపై నిందలు మోపేలా చహల్ అలాంటి టీ షర్టు ధరిస్తాడని ముందుగానే తనకు తెలుసునంది. తన పార్ట్నర్ను ఎంతో ప్రేమించానని.. అందుకే విడాకుల తీర్పు వినగానే కోర్టులోనే గట్టిగా ఏడ్చేశానంటూ ఆవేదనను పంచుకుంది.విడాకుల నేపథ్యంలో తనపై విపరీతమైన నెగటివిటీ వచ్చిందని.. అయితే, తన తల్లిదండ్రుల కోసం స్ట్రాంగ్‌గా ఉన్నట్లు నటిస్తున్నానని ధనశ్రీ చెప్పుకొచ్చింది. సున్నితమైన ఈ అంశంలో తన గోప్యతకు భంగం కలిగించేలా ఎంతో మంది ఎన్నో విధాలుగా పిచ్చి కూతలు కూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అత్యంత గౌరవం, ప్రేమ.. హ్యాట్సాఫ్ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన దేవిశా శెట్టి.. ‘‘నీ పట్ల అత్యంత గౌరవం, ప్రేమ ఉన్నాయి’’ అంటూ ధనశ్రీ వర్మకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ధనశ్రీ పట్ల టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల సతీమణులు.. రితికా సజ్దే, దేవిశా శెట్టి వైఖరిని పోలుస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తొలుత తప్పంతా ధనశ్రీ వర్మదే అని భావించినా.. కొత్త మహిళ రాక (మహ్వశ్)తో అంతా అర్థమైపోయిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే ధనశ్రీనే నిందిస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఆసియా కప్-2025 టోర్నీతో బిజీ కానున్నాడు. మరోవైపు.. టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ వన్డే రీఎంట్రీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక చహల్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
‘ఆ మాట వినగానే గట్టిగా ఏడ్చేశా.. అతడే ముందుగా వెళ్లిపోయాడు’
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) గత కొన్నాళ్లుగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకుల నేపథ్యంలో ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో అతడు తరచూ కలిసి కనిపించడం డేటింగ్ వదంతులకు ఊతమిచ్చింది. ధనశ్రీతో విడిపోయే ముందు నుంచే వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని జంటగా కనిపించడంతో చహల్‌పై ట్రోల్స్ వచ్చాయి.మానసికంగా కుంగిపోయా..ఇటీవల ఈ విషయంపై స్పందిస్తూ.. మహ్వశ్ తనకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పిన చహల్.. తన వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మనస్ఫూర్తిగా ధనశ్రీని ప్రేమించానని.. అయినప్పటికీ పరిస్థితి విడాకుల దాకా వచ్చిందని పేర్కొన్నాడు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయి ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశానని వెల్లడించాడు.ఆ మాట వినగానే ఏడ్చేశాఈ నేపథ్యంలో చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తాజాగా విడాకుల అంశంపై స్పందించింది. హ్యూమన్స్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘విడాకుల కోసం మేము మానసికంగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాము. కానీ.. ఆరోజు జడ్జిగారు తీర్పు ఇస్తున్నపుడు నేను భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయాను.అందరి ముందే గట్టిగా ఏడవడం నాకింకా గుర్తుంది. అసలు అప్పుడు నా మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో వేరెవరూ అర్థం చేసుకోలేరు. నేను అలా ఏడుస్తూ ఉండిపోయానంతే. అయినా ఇది జరిగిపోయిన విషయం.అతడే వదిలేశాడుఅతడే (చహల్) ముందుగా వైవాహిక జీవితం నుంచి బయటకు వెళ్లిపోయాడు’’ అంటూ ధనశ్రీ వర్మ తన ఆవేదనను పంచుకుంది. ఇక విడాకుల మంజూరు సందర్భంగా చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కోట్ రాసి ఉన్న టీ షర్టు ధరించడం గురించి ధనశ్రీకి ప్రశ్న ఎదురైంది.డ్రామాలు అవసరమా?ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎదుటి వాళ్లు మనల్ని నిందిస్తారు. ఇలాంటి టీ- షర్టు స్టంట్ ఉంటుందని నాకు ముందుగానే తెలుసు. ఈ విషయంలో తప్పంతా నాదేనని చిత్రీకరించేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారనీ తెలుసు.అయినా.. వాట్సాప్‌లో నాకు ఆ మెసేజ్ పెట్టి ఉంటే సరిపోయేది కదా!.. ఈ టీ-షర్టు డ్రామా ఎందుకు?’’ అంటూ ధనశ్రీ చహల్‌కు కౌంటర్ ఇచ్చింది. ఇక తన వైవాహిక జీవితంలో భాగస్వామికి ఎల్లవేళలా మద్దతుగా ఉన్నానని ధనశ్రీ స్పష్టం చేసింది.‘‘నా జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా ఉన్నాను. ప్రతీ చిన్న, పెద్ద విషయంలో అతడికి తోడుగా ఉన్నాను. మా అన్యోన్యత గురించి అందరికీ తెలుసు. అందుకే విడిపోతున్నామని తెలిసినపుడు నా మనసు అంతగా వేదనకు గురైంది’’ అని ధనశ్రీ తాను చహల్ పట్ల ప్రేమ, అంకితభావంతో మెలిగానని పేర్కొంది.కాగా కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను 2020లో చహల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లైన రెండేళ్లకే విభేదాలు తలెత్తగా ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. భరణంగా రూ. 4 కోట్ల 75 లక్షలుఈ క్రమంలో కోర్టుకు హాజరైన చహల్.. ‘‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అన్న కొటేషన్ ఉన్న నలుపు రంగు టీ- షర్టు ధరించాడు. భరణంగా మాజీ భార్యకు రూ. 4 కోట్ల మేర చెల్లించేందుకు అంగీకరించిన చహల్ ఈ చర్య ద్వారా పరోక్షంగా ధనశ్రీకి కౌంటర్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
నిహారిక డిఫరెంట్ గెటప్.. ధనశ్రీ గ్లామర్
డిఫరెంట్ లుక్‌లో కనిపించిన నిహారికగ్లామర్తో మాయ చేస్తున్న ధనశ్రీ వర్మక్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీసులో అనంతికఎక్సర్సైజ్ చేస్తూ గ్లామర్‌తో మల్లికా షెరావత్నాభి అందాలతో రచ్చ లేపుతున్న రాశీ సింగ్ముద్దబంతి పూల మార్కెట్లో మానస వారణాసి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’
న్యూఢిల్లీ: భారత లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ ఇటీవలే అధికారికంగా విడిపోయారు. అయితే విడాకులకు ముందు తాను తీవ్ర మానసిక వేదనను అనుభవించానని చహల్ చెప్పాడు. కొందరు తనను మోసగాడిగా చిత్రీకరించారని, తాను ఎప్పుడూ మోసం చేయలేదని...తాను ప్రేమించిన వ్యక్తి పట్ల విధేయతతోనే ఉన్నానని అతను పేర్కొన్నాడు. ‘నా విడాకుల తర్వాత నన్ను కొందరు మోసగాడు అన్నారు. కానీ నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. నేను ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతో ఎక్కువ విధేయతను ప్రదర్శించాను. మనసారా ప్రేమించాను’ అని చహల్ వ్యాఖ్యానించాడు. ధనశ్రీతో విడాకుల దాకా పరిస్థితి వచ్చినప్పుడు మానసికంగా బాగా దెబ్బ తిన్నానని అతను గుర్తు చేసుకున్నాడు. ‘నేను ఎలాంటి వేదనను అనుభవించానో నా సన్నిహితులకు బాగా తెలుసు. జీవితం పట్ల అలసిపోయినట్లు అనిపించింది. రోజులో రెండు గంటలు మాత్రమే పడుకుంటే రెండు గంటల పాటు ఏడుస్తూనే ఉండేవాడిని. ఇది దాదాపు నలభై రోజులు సాగింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించా’ అని ఈ స్పిన్ బౌలర్ వెల్లడించాడు. అధికారికంగా విడాకులు తీసుకునే వరకు బయటపడవద్దని...అప్పటి వరకు కలిసే ఉన్నట్లుగా బయట కనిపించేందుకు తాము ప్రయతి్నంచినట్లు అతను చెప్పాడు. మరో వైపు ఇతర అమ్మాయిలతో తనకు ఏదో బంధం ఉన్నట్లుగా వచి్చన వదంతులు మరింతగా బాధపెట్టాయని చహల్ వివరించాడు. ‘ఎవరితోనైనా కనిపిస్తే చాలు సంబంధం అంటగట్టేస్తూ వచ్చారు. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు’ అని చహల్ చెప్పాడు. చహల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. -
నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలలో "పవర్ కపుల్ పేరొందిన ఈ జంట ఒక్కసారిగా విడిపోయి అందరికి షాకిచ్చారు. సరిగ్గా ఇదంతా చాహల్ భారత జట్టుకు దూరమైన సమయంలోనే జరిగింది.దీంతో చాహల్ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే ధనశ్రీ నుంచి విడాకులు తీసుకోవడంపై చాహల్ తాజాగా స్పందించాడు. విడాకులు తర్వాత వచ్చిన తప్పుడు ఆరోపణలు తనను ఎంతోగానే బాధించాయని చహల్ భావోద్వేగానికి లోనయ్యాడు.ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.."విడాకుల సమయంలో నాపై ఎన్నో నిరాధరమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో నేను మానసికంగా కుంగిపోయాను. ఇక ఈ జీవితం చాలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. గంటలు తరబడి ఏడ్చేవాడిని. దాదాపు 40 నుంచి 45 రోజుల పాటు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయాను. నాకు ఇష్టమైన క్రికెట్‌పై ఏకాగ్రత పెట్టలేకపోయాను. నా స్నేహితుడితో ఆత్మహత్య ఆలోచనలను పంచుకునేవాడిని. చాలా భయపడ్డాను. అందుకే కొద్ది రోజులు క్రికెట్‌కు దూరంగా ఉన్నాను.నేను ఎప్పుడూ మోసం చేయలేదు.."ధనశ్రీతో విడాకులు తీసున్నాక చాలామంది మోసగాడిగా అభివర్ణించారు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తి తనకు దొరకడు. సోదరీమణులు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వారితో కలిసి పెరిగాను. కాబట్టి మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. నా పేరును ఇతరులతో లింక్ చేసి చాలా కథనాలు రాశారు. కేవలం వ్యూస్ కోసం అలా చేశారు" అని రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో జరిగిన ఇంటర్య్వూలో చాహల్ పేర్కొన్నాడు. కాగా చాహల్-ధనశ్రీ వర్మలు 22 డిసెంబర్ 2020న ప్రేమ వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఇద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరికి ముంబైలోని బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసింది. చాహల్ ప్రస్తుతం ఆర్జే మహ్వాష్తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.చదవండి: #Karun Nair: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’
గత కొన్నాళ్లుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాల కారణంగా యుజీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. భార్య ధనశ్రీ వర్మతో అధికారికంగా విడిపోయే ముందే చహల్.. రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash)తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) టోర్నీని వీక్షించేందుకు మహ్వశ్తో కలిసి చహల్ దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడే ఈ ‘ప్రేమపక్షులు’ కెమెరా కంటికి చిక్కగా చహల్ కొత్త ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ధనశ్రీ వర్మతో చహల్‌కు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.ప్రేమలో ఉన్నట్లు హింట్ అప్పటి నుంచి ఎక్కడ చూసినా చహల్- మహ్వశ్ జంటగానే కనిపిస్తున్నారు. ఇటీవల ఓ షోకు హాజరైన చహల్ తాను ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇచ్చేశాడు కూడా!.. మరోవైపు.. మహ్వశ్ కూడా చహల్ మాజీ భార్య ధనశ్రీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పలుమార్లు విమర్శలు గుప్పించింది. భరణం విషయంలోనూ ధనశ్రీ తీరును తప్పుబట్టింది.చీటింగ్ గురించి మహ్వశ్ వీడియోతాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చింది. ఇది మోసం చేసే కాలం అంటూ.. ‘‘ఓ బంధంలో ఇలాంటి పనులు చేయడం మోసం. అలా చేసేవాళ్లను వాళ్ల కర్మకు వారిని వదిలిపెట్టాలి. వాళ్లు ఇప్పటికే కుంగుబాటుకు గురై ఉంటారు.మోసానికి గురవుతున్న వ్యక్తి పట్ల మనం సానుభూతి చూపాల్సిందే. ప్రేమ లేదని అతడు రోజూ బాధపడిపోతుంటాడు. అయితే, ప్రేమను వ్యాప్తి చేయడానికి మరొక వ్యక్తి జీవితంలోకి వచ్చి మళ్లీ మోసం చేస్తాడు. ఆ తర్వాత ఇంకొకరిని కూడా మోసం చేసేందుకు సిద్ధపడతాడు.దేవుడు వారి పనులకు అడ్డుకట్ట వేసేంతవరకు ఏ వ్యక్తి అయినా ఇలాగే చేస్తారు. అలాంటి వాళ్లను రెండుసార్ల కంటే ఎక్కువ క్షమించవద్దు. లేదంటే మీరు బాధపడాల్సి వస్తుంది. నా గత రిలేషన్షిప్లో ఇదే జరిగింది.అలాంటి వారిని చూసి మనం జాలి పడి వదిలేయాలి. వారివి చెడు ఆలోచనలు. కానీ మీరు అలా కాదుగా.. వారి కంటే మన జీవితంలోకి గొప్ప వ్యక్తి తప్పక వస్తారు. జీవితం చాలా చిన్నది. కొన్నిసార్లు సరైన వ్యక్తితో కంటే.. తప్పుడు వ్యక్తితోనే మనం ఎక్కువకాలం జీవించాల్సి వస్తుంది’’ అని మహ్వశ్ చెప్పుకొచ్చింది.వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా!ఈ నేపథ్యంలో చహల్- ధనశ్రీల పేర్లు ప్రస్తావిస్తూ.. ‘‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా!’’ అంటూ ఓ నెటిజన్ మహ్వశ్కు కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు స్పందిస్తూ... ‘‘నేను ఎవరినీ లాక్కోలేదు. కాబట్టి నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. ఏదేమైనా వేరొకరి భర్తను లాక్కోవడం కచ్చితంగా మోసం చేయడమే’’ అని పేర్కొంది. అంతేకాదు వ్యూస్ కోసం తనలాంటి వాళ్లను టార్గెట్ చేయడం ఇలాంటివి వారికి అలవాటు అంటూ సెటైర్ వేసింది. దీంతో మరోసారి ఆమె నెటిజన్లకు టార్గెట్ అయింది.కాగా కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్.. 2020, డిసెంబరులో ఆమెను పెళ్లాడాడు. అయితే, వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఈ ఏడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే, భార్యకు దూరంగా ఉంటున్న సమయంలోనే మహ్వశ్తో కలిసి చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కిన చహల్.. తమ బంధం గురించి ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇక చహల్ చివరగా ఇంగ్లండ్ కౌంటీల్లో నార్తాంప్టన్‌షైర్‌కు ఆడాడు. చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే? -
రెండు జడల అనసూయ.. గోరింటాకుతో అనన్య
'హ్యారీపోటర్' చీరలో రెండు జళ్లతో అనసూయఆషాడం సీజన్.. గోరింటాకుతో అనన్య నాగళ్లరోజ్తో గ్లామర్ చూపిస్తున్న నటి ధనశ్రీ వర్మతడుస్తూ ఫొటోలు పోజులిచ్చిన దిశా పటానీచీరలో అందమే అసూయపడేలా మిథిలా పాల్కర్బోనాలు కోసం బుట్టబొమ్మలా రెడీ అయిన స్రవంతిపెంపుడు కుక్కతో చిల్ అవుతున్న హీరోయిన్ త్రిష View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Izzy🧿Krishnan (@izzykrishnan) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) -
'గీతగోవిందం' నటి గ్రాడ్యుయేషన్.. ధనశ్రీ వర్మ ట్రెక్కింగ్
మత్తెక్కించేలా చూస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీలఫుడ్ గురించి నివేదా థామస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్ షాజన్ పదమ్సీట్రెక్కింగ్ చేస్తూ అందాలన్నీ చూపిస్తున్న ధనశ్రీ వర్మరిలాక్స్ మోడ్‌లో అక్కినేని వారి కోడలు శోభితఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన నటి అనీషాజిమ్లో తెగ కష్టపడుతున్న పూరీ ఫ్రెండ్ ఛార్మీ View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Aneesha Dama (@aneeshadama) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
చాహల్‌తో విడాకులు.. లండన్‌లో చిల్ అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)
-
నేను పూర్తిగా మారిపోయా.. విడాకుల అంశంపై ధనశ్రీ తొలిసారి
టీమిండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల అంశం ఇప్పటికీ ఏదోలా చర్చకు కారణమవుతూనే ఉంది. 2020లో ఈ జంట పెళ్లి చేసుకోగా కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ ఏడాదిన్నర క్రితం విడాకుల రూమర్స్ వచ్చాయి. కట్ చేస్తే ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. అప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్న ఈమె.. ఇప్పుడు తొలిసారి మీడియాతో మాట్లాడింది. విడాకుల తర్వాత తాను చాలా మారిపోయినట్లు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: Spirit: రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా.. త్రిప్తికి ఎంత ఇస్తున్నారంటే?) 'ట్రోలింగ్ నన్నేం బాధపెట్టదు. ఎందుకంటే నాకు మనోబలం ఎక్కువ. బయట సమస్యలు నన్నేం చేయలేవు. నెగిటివిటీ, బహిరంగ విమర్శలు.. నన్ను ఎప్పుడూ బాధించలేదు. నేను చాలా కష్టపడే మనిషిని. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నన్ను నేను ప్రేమించుకోవడం, క్రమశిక్షణ, వ్యాయామం, మంచి ఫుడ్‌తో పాటు నన్ను ప్రేమించే, గౌరవించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నారు' అని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది.రీసెంట్ టైంలో ఎదురైన పరిస్థితులు నన్ను దృఢంగా మార్చాయి. నా తల్లిదండ్రులు ఎంత బలమైన కూతుర్ని పెంచారో తెలిసొచ్చింది. ఇప్పుడు నాపై వస్తున్న పుకార్ల గురించి క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడేం చెప్పినా అది మరింత చర్చకు కారణమవుతాయి. అలానే ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైన అంశం అని ధనశ్రీ చెప్పింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)చాహల్‌తో విడాకులు తీసుకోవడం ఏమో గానీ ధనశ్రీపై చాలా విమర్శలు వచ్చాయి. రూ.60 కోట్ల భరణం తీసుకుందని అన్నారు. కానీ అదంతా పుకారే అని తేల్చారు. మరోవైపు చాహల్‌తో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న ఆర్జే మహ్వశ్ అనే అమ్మాయి కూడా అప్పుడప్పుడు పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేది. ఇప్పుడు వాటిపైనే స్పందించిన ధనశ్రీ.. అలాంటివే పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది.ప్రస్తుతం తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో హీరోయిన్గా చేసిన ధనశ్రీ వర్మ.. హిందీలో భోల్ చుక్ మాఫ్ అనే మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అంతకు ముందు ఈమె యూట్యూబర్‌గా చాలా ఫేమస్.(ఇదీ చదవండి: ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?) -
'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) హీరోగా నటించిన మూవీ 'భూల్ చుక్ మాఫ్' (Bhool Chuk Maaf) డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. మే 9న థియేటర్స్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిల వల్ల డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇందులో వామికా గబ్బి హీరోయిన్గా నటించగా.. ధనశ్రీ వర్మ స్పెషల్ సాంగ్‌లో దుమ్మురేపింది. ఈ చిత్రాన్ని కరణ్ శర్మ తెరకెక్కించారు. స్త్రీ 2 మూవీతో భారీ విజయాన్ని అందుకున్న రాజ్‌కుమార్ రావ్ 'భూల్ చుక్ మాఫ్' ద్వారా మరో హిట్ కొట్టాలని ప్లాన్ వేశాడు. కానీ, అది ఫలించలేదు.'భూల్ చుక్ మాఫ్' థియేట్రికల్ రిలీజ్ క్యాన్సిల్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారీ ఆశలతో ఈ సినిమాను థియేటర్లో ప్రేక్షకులతో పాటుగా చూడాలని తాము అనుకున్నాం. కానీ, దేశ స్ఫూర్తి, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామంటూ.. జై హింద్ అని ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.భూల్ చుక్ మాఫ్ మూవీ పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ కథ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రి పెట్టిన పరీక్షలో ఒక యువకుడు ఎలా నెగ్గాడు. కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అనుకుంటే.. యువతి తండ్రికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. దాని వల్ల మొదలైన ఇబ్బందులు ఏంటి..? అనేది సినిమాలో తెలుసుకోవాలి. ‘టింగ్ లింగ్ సజా మే’ అనే పాటలో ధనశ్రీ స్టెప్పులు అదుర్స్ అనేలా ఉంటాయి. క్రికెటర్ చాహల్‌తో విడిపోయాక ఆమె నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది. -
మొన్ననే విడాకులు .. ఇప్పుడు ఐటమ్ సాంగ్
టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర చాహల్.. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలావరకు బాగానే ఉండేది. మరి ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు.అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్నీమధ్యే తెలుగులో 'ఆకాశం దాటివస్తావా' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రం మే 09న థియేటర్లలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తోంది.ఎందుకంటే విడాకులు తీసుకున్న కొన్నిరోజుల తర్వాత తెలుగు, హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
ధనశ్రీ వర్మ పేరు దాదాపు అందరికీ సుపరిచితమైన పేరు. ఇటీవలే భారత క్రికెటర్ చాహల్‌తో విడాకులు తీసుకుంది. 2020లో చాహల్‌ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగమ్మ ఐదేళ్లకే తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. అయితే కెరియర్ పరంగా ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ సంగతులేంటో చూసేద్దాం.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో బలగం తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే ధనశ్రీ వర్మ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో ధనశ్రీ వర్మ కనిపించింది. ఈ సినిమాలో చాహల్ మాజీ భార్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.కాగా.. ముంబయిలో పుట్టి పెరిగిన ధనశ్రీ డెంటిస్ట్‌గా వైద్య రంగంలో వృత్తిని కొనసాగించారు. నృత్యంపై తనకున్న అభిరుచితో లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంతంగా డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ధనశ్రీ డిసెంబర్ 22, 2020న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకుంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు. -
దిల్‌రాజు బ్యానర్ 'ఆకాశం దాటి వస్తావా' సెట్స్‌లో ధనశ్రీ వర్మ (ఫోటోలు)
-
చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..?
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్-ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం చహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ధనశ్రీ చహల్‌ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేయడం క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ధనశ్రీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ధనశ్రీ చహల్‌ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఈ విషయంలో చహల్‌కు అండగా నిలుస్తున్నారు. చాలా మంది క్రికెట్ అభిమానుల్లాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా చహల్‌కు మద్దతుగా నిలిచినట్లనిపిస్తుంది.తాజాగా ధనశ్రీని విమర్శిస్తూ శుభాంకర్ మిశ్రా అనే జర్నలిస్ట్ సోషల్‌మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి రితిక లైక్ కొట్టింది. ఇది తెలిసి అభిమానులు ధనశ్రీ అంటే రితికకు సరిపోదా అని చర్చించుకుంటున్నారు. ధనశ్రీపై శుభాంకర్ విమర్శలతో ఏకీభవించే రితిక ఇలా చేసుంటుందని అనుకుంటున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?శుభాంకర్ మిశ్రా ధనశ్రీ వర్మను 'గోల్డ్ డిగ్గర్' అని సంబోధించాడు. గోల్డ్ డిగ్గర్ అంటే డబ్బు కోసం ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకునే మహిళ అని అర్దం. వీడియోలో శుభాంకర్ ధనశ్రీని ఉద్దేశిస్తూ ఇలా కూడా అన్నాడు. విడాకుల తర్వాత ధనశ్రీ ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొనుంది. అందకే ఆమె చహల్‌ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేసింది. భరణం పేరుతో భర్త నుంచి డబ్బు తీసుకుంటే అది సాధికారత ఎలా అవుతుంది. ఇలా చేసి స్వయంకృషితో ఎదిగిన మహిళ అని ఎలా చెప్పుకుంటారంటూ వ్యంగ్యంగా విమర్శించాడు.కాగా, చహల్, ధనశ్రీ వర్మ 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ దగ్గర చహల్ డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లేవాడు. అక్కడ వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత చహల్, ధనశ్రీ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఈ ఏడాది మార్చి 20న చహల్, ధనశ్రీకి విడాకలు మంజూరయ్యాయి. గత ఏడాదిన్నరగా వీరిద్దరు కలిసి లేరని తెలుస్తుంది. అంటే వీరి వివాహ బంధం ముచ్చటగా మూడేళ్లు మాత్రమే సాగిందన్న మాట.ఇదిలా ఉంటే, చహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చహల్‌ను ఇటీవలే (మెగా వేలంలో) పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. చహల్ గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. అంతకుముందు అతను ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించే వాడు. చహల్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నా టీమిండియాలో చోటు మాత్రం దక్కడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత స్పిన్ విభాగం అత్యంత పటిష్టంగా ఉండటంతో చహల్‌కు అవకాశాలు రావడం లేదు. చహల్ పంజాబ్ జెర్సీలో ఇవాళ (మార్చి 25) తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నేటి మ్యాచ్‌లో పంజాబ్ గుజరాత్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ధనశ్రీ విషయానికొస్తే.. ఆమె ఇటీవలే ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోపై సోషల్‌మీడియాలో ద్వంద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్ల భరణం: ఇందులో ట్యాక్స్ ఎంతంటే?
టీమిండియా క్రికెటర్ 'యజువేంద్ర చహల్', సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ 'ధనశ్రీ వర్మ' పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో చహల్.. ధనశ్రీకు భరణం కింద రూ. 4.75 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే భరణం డబ్బులో.. ట్యాక్స్ ఏమైనా చెల్లించాలా?, చెల్లిస్తే ఎంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.విడాకులు తీసుకోవడానికి ముందే చహల్.. ధనశ్రీకి రూ.2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన డబ్బు త్వరలోనే ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక దీనిపై ట్యాక్స్ ఎంత చెల్లించాల్సి ఉంటుందా? అనే విషయానికి వస్తే.. భరణం ఒకేసారి చెల్లించినట్లయితే.. ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దీన్ని నాన్ ట్యాక్సెసిబుల్ అసెట్‌గా పరిగణిస్తారు. ఇలాంటి వాటిపైన పన్నులు ఉండవు.భరణం అనేది నెలవారీ లేదా ఏడాదికి చెల్లించినట్లయితే.. దాన్ని రెవెన్యూ రెసిప్ట్గా పరిగణిస్తారు. ఈ విధానంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే భరణం పొందిన వ్యక్తి వీటిని ఆదాయపు పన్ను రిటర్న్‌లో ప్రకటించాలి. ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాలి.భరణం కాకుండా.. ఆస్తులను బదిలీ చేస్తే, అలాంటి వాటిపైన ట్యాక్స్ పడుతుంది. ఈ పన్నును భరణం పొందిన వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడానికి ముందే, ఆస్తుల బదిలీ జరిగి ఉంటే.. దానిని గిఫ్ట్ కింద పరిగణిస్తారు. అప్పుడు మీరు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.భరణం అంటే ఏమిటి?భార్య భర్తలు విడిపోయిన తరువాత.. జీవిత భాగస్వామి (భార్య) ఆర్థిక అవసరాలకు అందించే సహాయాన్ని భరణం అంటారు. భారతదేశంలో భరణం పొందటానికి.. హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ డివోర్స్ యాక్ట్, ముస్లిం ఉమెన్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ వంటి అనేక చట్టాలు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!భరణం ఇవ్వడానికి ముందు.. న్యాయస్థానం కూడా, అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో వివాహం సమయంలో వారి లైఫ్ స్టైల్, ఖర్చులు, వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది?, పిల్లలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం చేసే భార్య జీతం.. భర్త జీతంతో సమానంగా ఉంటే, అప్పుడు భరణం తగ్గే అవకాశం ఉంటుంది. -
Dhanashree Verma: సరిగ్గా అదే టైంకి ధన శ్రీ పాట రిలీజ్
యూట్యూబర్ ధనశ్రీ వర్మ ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణం విడాకులు. టీమిండియా క్రికెటర్ చాహల్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. గత కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది. తాజాగా కోర్ట్ వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కానీ ఇదే టైంలో ధనశ్రీ.. గృహహింసపై చేసిన ఓ పాట రిలీజ్ కావడం చర్చనీయాంశమైంది.2020 డిసెంబరులో చాహల్- ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. ఐపీఎల్ తన భర్త ఆడే ప్రతి మ్యాచ్ కి ధనశ్రీ వచ్చేది. మరి ఏమైందో ఏమో కొన్నాళ్ల క్రితం వీళ్లిద్దరూ ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అదే టైంలో ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్ల ఇస్తారనే రూమర్స్ వినిపించాయి. వీటిని ధనశ్రీ కుటుంబం ఖండింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి కొత్త సినిమా)మరోవైపు చాహల్.. ఆర్జే మహ్ వశ్ అనే అమ్మాయితో కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఇవన్నీ పక్కనబెడితే తాజాగా న్యాయస్థానం చాహల్-ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది. భరణంగా రూ.4.75 కోట్లు ఇస్తాడని తేలింది. ఇదంతా గురువారం జరగ్గా.. అదే టైంలో ధనశ్రీ నటించిన ఓ ఆల్బమ్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.'దేఖా జీ దేఖా మైనే' అని సాగే ఈ పాటంతా గృహహింస నేపథ్యంగా తీశారు. ధనశ్రీ.. గృహహింస బాధితురాలు, భర్త చేతిలో మోసపోయిన మహిళగా కనిపించింది. భర్తను ఎంతగానో ప్రేమించినప్పటికీ.. అతడు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండటం.. అడిగినందుకు దాడి చేయడం, చివరకు విడాకులు తీసుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే చాహల్ పై ప్రతీకారంగా ధనశ్రీ ఈ పాట తీసిందా అనే సందేహం వచ్చింది.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?) -
ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె!
టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- యూట్యూబర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. గత కొంతకాలంగా వేరుగా ఉంటున్న ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20) ఈ మేరకు తుదితీర్పును వెల్లడించింది.ఈ నేపథ్యంలో చహల్ - ధనశ్రీ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. విడాకుల అనంతరం వీరిద్దరు బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చహల్ ధరించిన షర్టుపై ఉన్న సామెత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ధనశ్రీకి చహల్ కౌంటర్?'Be your own sugar daddy' అని రాసి ఉన్న నలుపు రంగు కస్టమైజ్డ్ షర్టును చహల్ వేసుకున్నాడు. ఈ సామెతకు.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అనే అర్థం ఉంది. ఈ నేపథ్యంలో చహల్ తన మాజీ భార్య ధనశ్రీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షర్టు ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకున్న చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో 2020, డిసెంబరులో ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకుంటోంది.ఈ క్రమంలో వీరిద్దరు రీల్స్‌లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేయడంతో పాటు.. టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చహల్ వెంట వెళ్లిన ఫొటోలు కూడా పంచుకునేది. అయితే, కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ ‘చహల్’ పేరును తీసివేసింది. దీంతో విడాకుల వార్తలు తెరమీదకు వచ్చాయి.ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూఆ తర్వాత ఇద్దరూ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించడంతో వీటికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో.. వదంతులు నిజమేనని తేలాయి. ఇక విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చహల్.. ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూ ధనశ్రీకి హితవు పలికేలా ఈ సామెత ఉన్న షర్టును ధరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ధనశ్రీ గతంలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. అతడి పేరుతో ఆమెను ముడిపెట్టారు. నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియోగ్రాఫర్ కావడం.. ధనశ్రీకి ఆమె స్నేహితురాలు కావడం వల్ల శ్రేయస్‌తో ఆమె డాన్స్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.మధ్యలో ఆమె!అయితే, చహల్ ప్రస్తుతం ఆర్జే మహవశ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం, ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 సమయంలోనూ మహవశ్‌తో జంటగా కనిపించడం ‘ప్రేమ’ వార్తలకు ఊతమిచ్చాయి. ఇక చహల్- ధనశ్రీ విడాకుల వేళ మహవశ్ కూడా.. ‘‘అబద్ధాలు, అత్యాశ, అబద్ధపు ప్రచారాలు.. దేవుడి దయవల్ల వీటన్నింటికీ అతీతంగా నిలబడగలుగుతున్నాం’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇందుకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. చహల్- ధనశ్రీ మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది ఇప్పుడు అర్థమైందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘కొత్త వదినతోనైనా జాగ్రత్త’ అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.చదవండి: IPL 2025: ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
ఇకపై భార్యాభర్తలు కారు.. బంధం ముగిసిపోయింది (ఫొటోలు)
-
చహల్, ధనశ్రీ బంధానికి ఎండ్ కార్డు.. విడాకులు మంజూరు
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. చాహల్-ధనశ్రీ అధికారికంగా విడిపోయారు. వీరిద్దిరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. దీంతో ఈ జంట ఐదేళ్ల వివాహ బందం నేటితో ముగిసింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడు. ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ధనశ్రీకి భరణం కింద చెల్లించినట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి విడాకుల కేసుపై గత కొంతకాలంగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఐపీఎల్-2025లో పాల్లోనేందుకు చాహల్ వెళ్లనుండడంతో విచారణను వేగవంతం చేయాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. అదేవిధంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా, తప్పనిసరి ఆరు నెలల విరామ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) గడువును హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలొనే బాంద్రా ఫ్యామిలీ కోర్టు నేడు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.యూట్యూబర్, కొరియాగ్రాఫర్ అయిన ధనశ్రీతో 2020 డిసెంబర్ 22న చాహల్‌కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించేవారు. కానీ గత రెండేళ్లగా విభేదాలు తలెతెత్తడంతో వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు.అయితే గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి ‘చాహల్’ పేరును తీసేయడంతో పాటు ఫొటోలను కూడా డిలేట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నరంటూ వార్తలు వ్యాపించాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులకు సంబంధించి పూటకో ఓ వార్త వస్తూనే ఉండేది. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని అధికారికంగా స్పష్టమైంది. ఇక ధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్వశ్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.చదవండి: షాక్‌లో క్రికెట్ ఫ్యాన్స్.. నమీబియా కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ -
రూ.4 కోట్ల 75 లక్షలు!
ముంబై: భారత క్రికెట్ జట్టు లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహ బంధం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. వీరిద్దరు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నా ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా చెబుతారు.అయితే తాము రెండున్నరేళ్లకు పైగా విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నాం కాబట్టి ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని చహల్, ధనశ్రీ కోరారు. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్ కారణంగా తాను కనీసం మూడు నెలలు అందుబాటులో ఉండలేనని కూడా చహల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన హైకోర్టు...ఈ నిబంధన నుంచి వీరిద్దరికి సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విడాకులకు సంబంధించి గురువారమే తుది తీర్పు ఇవ్వాలని కూడా సూచించింది. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి చహల్ రూ. 4 కోట్ల 75 లక్షలు భరణం రూపంలో చెల్లించనున్నాడు.ఇందులో అతను ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ఇచ్చేశాడు. యూట్యూబర్, కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చహల్‌కు డిసెంబర్, 2020లో పెళ్లి జరగ్గా... 18 నెలల తర్వాత జూన్ 2022 నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు. -
భార్యకు విడాకులు.. భరణంగా చహల్ ఎన్ని కోట్లు ఇస్తున్నాడంటే..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ల వైవాహిక బంధం ముగిసిపోయింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే, చట్ట ప్రకారం ఆరు నెలల పాటు కలిసి ఉండాలన్న నిబంధనను తమ కేసులో పరిగణనలోకి తీసుకోవద్దని చహల్- ధనశ్రీ కోరగా.. ఫిబ్రవరి 20న ఫ్యామిలీ కోర్టు వీరి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో చహల్- ధనశ్రీ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో వీరికి ఉపశమనం కలిగించింది. విడాకుల అంశాన్ని గురువారం తేల్చాల్సిందిగా బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. వేరుగా ఉంటున్నారుజస్టిస్ మాధవ్ జామ్దార్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 22 నుంచి చహల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో కానున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.‘‘పిటిషనర్ 1 (చహల్) ఐపీఎల్లో పాల్గొనాల్సి ఉందని.. కాబట్టి మార్చి 21 తర్వాత అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాబట్టి మార్చి 20న ఈ విషయమై ఫ్యామిలీ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది.కాగా హిందూ వివాహ చట్టం ప్రకారం.. విడాకులు జారీ చేసే ముందు తమ సమస్యను పరిష్కరించుకుని కలిసిపోయేందుకు కనీసం ఆరు నెలల పాటు కోర్టు సమయం ఇస్తుంది. అయితే, చాలా కాలం నుంచే చహల్- ధనశ్రీ విడిగా ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే భార్యాభర్తలుగా వారు వేరుపడినందున.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో తమకు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు ఈ విషయమై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రూ. 4.75 కోట్ల భరణం!కాగా ధనశ్రీకి భరణం రూపంలో రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు చహల్ సిద్ధపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షల యాభై ఐదు వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా మొత్తం చెల్లించేందుకు కూడా చహల్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి.. పిటిషనర్ల మధ్య ఎలాంటి వివాదానికి తావు లేనందున విడాకుల మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించినట్లు సమాచారం. ప్రేమ వివాహం..కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరిగా జాతీయ జట్టుకు ఎంపికైన చహల్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాకు ఎంపిక కాలేదు.అయితే, ఐపీఎల్లో మాత్రం చహల్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 160 మ్యాచ్‌లు ఆడిన ఏకంగా 205 వికెట్లు తీశాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.ఇక చహల్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2020, డిసెంబరులో కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. లాక్డౌన్లో సోషల్ మీడియా ద్వారా ధనశ్రీతో పరిచయం ప్రేమగా మారింది. అయితే, వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్‌కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
అందరూ ధనశ్రీని టార్గెట్ చేస్తే నేను సపోర్ట్ చేశా.. అప్పుడు..: ఉర్ఫీ
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోతున్నారంటూ ఈ ఏడాది ఆరంభం నుంచి పుకార్లు ఊపందుకున్నాయి. చివరకు ఆ పుకార్లను నిజం చేస్తూ ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఇటీవలే వీరికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ జంట డివోర్స్ తీసుకోనుంది అన్నప్పటినుంచి చాలామంది ధనశ్రీని టార్గెట్ చేశారు.ప్రతిసారి అమ్మాయిదే తప్పా?చాహల్‌ను ఒంటరిని చేసిందని, ధనశ్రీ ఏదో తప్పు చేసుంటుందని.. రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో సోషల్ మీడియా సెన్సేషన్, నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) ధనశ్రీకి మద్దతుగా నిలిచింది. చాహల్ జీవితాన్ని ధనశ్రీ నాశనం చేసిందన్న పోస్టుపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రికెటర్ బ్రేకప్ చెప్పినప్పుడు, విడాకులు తీసుకుంటున్నప్పుడల్లా అమ్మాయిదే తప్పని ముద్ర వేస్తారు. ఆమెపైనే నిందలేస్తారు. ఎందుకంటే మనకు క్రికెటర్ అంటే హీరో కదా! మీకు గుర్తుందా?నిజంగా ఆ జంటల మధ్య ఏం జరిగిందనేది మనకెవరికీ తెలియదు. విరాట్ సరిగా ఆడకపోయినా కూడా అనుష్కదే తప్పన్నారు. మీకు గుర్తుందో, లేదో మరి! అంటే అక్కడ మగవాడు ఏం చేసినా అందుకు మహిళలే కారణం.. ఈ అబ్బాయిలేం చిన్నపిల్లలు కాదు. వాళ్లేం చేస్తున్నారో వారికి అన్నీ బాగా తెలుసు అని రాసుకొచ్చింది.ధనశ్రీకి సపోర్ట్ చేశానని..ఈ పోస్ట్ చూసిన ధనశ్రీ తనకు థాంక్స్ చెప్పిందంటోంది ఉర్ఫీ జావెద్. తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఈ విడాకుల వ్యవహారంలో ధనశ్రీని దారుణంగా చిత్రీకరించారు. అప్పుడామెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశాను. అప్పటికే బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ఆమె అది చూసి నాకు కృతజ్ఞతలు తెలియజేసింది అని తెలిపింది.చదవండి: దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు -
ట్రెండింగ్ లో చాహల్, ధనశ్రీ.. ఎందుకో తెలుసా (ఫొటోలు)
-
కౌన్సెలింగ్ ఇచ్చినా మారని చాహల్, ధనశ్రీ..
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతడి భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయినట్లు వినికడి. గురువారం బాంద్రా కోర్టు బయట చాహల్ కన్పించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఏబీపీ న్యూస్ రిపోర్టు ప్రకారం.. గురువారం ఉదయం చాహల్- ధనశ్రీ విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఆ తర్వాత న్యాయమూర్తి ఈ జోడీకి కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు. దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్నారని న్యాయమూర్తికి తెలియజేశారు. దీంతో సాయంత్రం 4.30 గంటలకు వీళ్లకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తుది విచారణకు ముందు చాహల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు"దేవుడు నన్ను నేను లెక్కించగలిగే దానికంటే ఎక్కువ సార్లు రక్షించాడు. ఆ సందర్బాలు కూడా నాకు గుర్తులేవు. నేను కష్టాల్లో ప్రతీ సమయంలోనూ దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడూ నాకు రక్షణగా ఉన్న దేవుడుకి కృతజ్ఞతలు’ అని చాహల్ రాసుకొచ్చాడు."మనం పడే బాధలు, ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తడిని కొంతకాలం అనంతరం ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయం తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి.దేవుడిపై మీకున్న విశ్వాసం మీకు మంచి జరిగేలా చేస్తుంది అంటూ ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ను షేర్ చేసింది. కాగా 2020లో కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో వర్మతో చాహల్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో డిసెంబర్ 2020లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. -
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ విడాకులు.. తాజా పోస్ట్‌తో క్లారిటీ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మపై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన భర్త, టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలో నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన పోస్టులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన బామ్మ, తాతయ్యల ఇంటికెళ్లిన ధనశ్రీ నిజమైన ప్రేమ అంటే ఇదేనంటూ ఫోటోలను షేర్ చేసింది. అంతే చాహల్ సైతం తన భార్యతో దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించాడు. దీంతో ఈ జంట దాదాపు విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ వర్మ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. "ఒత్తిడి నుంచి ఆశీర్వాదం లభించింది. దేవుడు మన చింతలను, పరీక్షలను ఎలా ఆశీర్వాదాలుగా మార్చగలడనేది ఆశ్చర్యంగా లేదా? మీ జీవితంలో ఏ రోజైనా ఒత్తిడికి గురైతే.. మీకు మరో ఛాయిస్ ఉంటుందని తెలుసుకోండి. మీరు బాధలను అన్నింటినీ ఆ దేవునికి వదిలేయండి. అన్ని విషయాల గురించి కలిసి ఆ దేవుడిని ప్రార్థించండి. దేవుడు మీరు ఉంచిన విశ్వాసం మీకు ఎప్పుడు మంచి చేస్తుంది.' అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇటీవల యుజ్వేంద్ర చాహల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో భగవంతుడే మనల్ని రక్షిస్తాడంటూ పోస్ట్‌ను పంచుకున్నారు. నేను లెక్కించగలిగిన దానికంటే ఎక్కువ సార్లు ఆ దేవుడు నన్ను రక్షించాడు.. నాకు తెలియకుండా నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు దేవా అంటూ పోస్ట్ చేశారు. తాజా పోస్ట్‌లతో ధనశ్రీ వర్మ, చాహల్ విడిపోవడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. విడాకులపై అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీరిద్దరు డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
చాహల్ భార్యకు భరణం రూ.60 కోట్లు!?
టీమిండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది.ఇటీవల కాలంలో చాహల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్‌లు సైతం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేశారు. చాహల్ అయితే ఏకంగా ఆమె ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో చాహల్-ధనశ్రీ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ధనశ్రీకి రూ. 60 కోట్లు..?ఈ క్రమంలో తాజాగా వారిద్దరి విడాకులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా చాహల్ 2020లో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జోడీ ఎప్పటికప్పుడు వీడియోలు, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరించేవారు. కానీ ఇటీవల కాలంలో ఎవరి జీవితం వారిదే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. కాగా వీరి విడాకులపై వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు వారిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని చాహల్-ధనశ్రీ తీవ్రంగా ఖండిచారు. కానీ ఈసారి మాత్రం వారిద్దరూ విడిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.తాజాగా ఈ వార్తలపై స్పందించిన ధనశ్రీ.. కొన్ని రోజులుగా ఆధారాలు లేని వార్తలు, ఫేస్ పోస్టులతో తన గౌరవాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నా మౌనం నా బలహీనతే కాదు అదే నా బలం. కొన్నేళ్లుగా తాను సంపాదించుకున్న పేరును నెగిటివిటీతో తీసేస్తున్నారు. కానీ నిజానికి విలువెక్కువ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. చాహల్ స్పందిస్తూ తమ ప్రైవసీని గౌరవించాలని.. బయటకొస్తున్న వార్తలు నిజాలు కావచ్చు, కాకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు.చదవండి: సౌతాఫ్రికా దిగ్గజం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు -
నిజమైన ప్రేమ అంటూ ఫొటోలు షేర్ చేసిన చహల్ భార్య.. ఫొటోలు వైరల్
-
అవన్నీ నిజం కాకపోవచ్చు: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో చహల్‌కు విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే ఈ జంట విడిపోనుందనేది(Divorce Rumours) వాటి సారాంశం. అందుకు చహల్ సోషల్ మీడియా పోస్టులు ఊతమిచ్చాయి.పెళ్లి ఫొటోలు డిలీట్సతీమణి ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal) డిలీట్ చేశాడు. పెళ్లి ఫొటోలను కూడా తన అకౌంట్ల నుంచి తీసేశాడు. అంతేకాదు.. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. అయితే, ధనశ్రీ ఇన్‌స్టా ఖాతాలో మాత్రం చహల్‌తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి.కాగా ధనశ్రీ చహల్‌ను మోసం చేస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరుతో ఆమె పేరును ముడిపెట్టి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరోవైపు.. చహల్ ఇటీవల ఓ పెళ్లికి మరో అమ్మాయితో కలిసి హాజరైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.ఆర్జేతో డేటింగ్?అంతేకాదు.. మహ్వశ్ అనే రేడియో జాకీతో కలిసి చహల్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. వీటికి మహ్వశ్ ఫ్యామిలీ అనే ట్యాగ్ జతచేయడంతో చహల్‌తో ఆమె డేటింగ్ చేస్తుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో చహల్ కూడా ధనశ్రీకి ద్రోహం చేశాడని.. దొందూ దొందేనంటూ ఈ జంటపై విమర్శల వర్షం కురుస్తోంది.ఈ పరిణామాలపై యజువేంద్ర చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘‘మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈస్థాయికి చేరుకోగలిగాను. అందుకు నా అభిమానులందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటాను. అయితే, ఇప్పటికి ఈ ప్రయాణం ఈ ముగిసిందా?.. లేదు.. నేను వేయాల్సిన ఓవర్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నా దేశం కోసం.. నా జట్టు కోసం.. నా అభిమానుల కోసం నేను ఆడుతూనే ఉంటాను.నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిగా ఉండటం నాకెంతో గర్వకారణం. అదే విధంగా.. నేను ఓ కొడుకుని, ఒకరికి సోదరుడిని.. అలాగే చాలా మందికి స్నేహితుడిని. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై చాలా మందికి ఆసక్తి కలిగించడం సహజమే. అయితే, కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల పుడుతున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!అందరూ బాగుండాలిఓ కొడుకుగా.. సోదరుడిగా, స్నేహితుడిగా.. మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వదంతులు నా కుటుంబ దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎదుటివారికి అంతా మంచే జరగాలని కోరుకునేలా నా కుటుంబం నాకు విలువలు నేర్పించింది. అదే విధంగా.. అడ్డదారుల్లో వెళ్లకుండా.. అంకిత భావం, కఠిన శ్రమతోనే విజయాన్ని అందుకోవాలని చెప్పింది. నేను ఇప్పటికీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నాను.ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. కానీ మీ సానుభూతిని భరించలేను. లవ్ యూ ఆల్’’ అని చహల్ ఇన్‌స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. అయితే, ఇందులో ఎక్కడా ధనశ్రీ పేరుగానీ, భర్త అనే పదం కానీ అతడు వాడలేదు. కాబట్టి విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ మరోసారి గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.డాన్స్ టీచర్‌తో ప్రేమలో పడికాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ నేర్చుకునే క్రమంలో ఆమెతో ప్రేమల్లో పడ్డ చహల్.. ఇరు కుటుంబాల సమ్మతంతో 2020, డిసెంబరు 20న ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్నర్‌గా సత్తా చాటాడు. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 అంతర్జాతీయ టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ 205 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది అతడు పంజాబ్ కింగ్స్‌కు ఆడనున్నాడు. చదవండి: వన్డే సిరీస్ నుంచి అతడికి విశ్రాంతి! -
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు. -
విడాకులకు సిద్ధమైన టీమిండియా క్రికెటర్!
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal ) విడాకులకు సిద్ధమయ్యాడా?.. భార్య ధనశ్రీ వర్మతో అతడు విడిపోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చహల్ సోషల్ మీడియా అకౌంటర్లను గమనిస్తే అతడు త్వరలోనే ఈ చేదు వార్తను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.హర్యానాకు చెందిన 34 ఏళ్ల చహల్ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చహల్.. వన్డే, టీ20లలో ప్రధాన స్పిన్ బౌలర్‌గా ఎదిగాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు 72 వన్డేలు, 80లు ఆడిన చహల్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు.ఐపీఎల్ వికెట్ల వీరుడుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ చహల్‌కు గొప్ప రికార్డు ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ టీ20 లీగ్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఏకంగా 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక చహల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కోవిడ్ లాక్డౌన్ సమయంలో యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో అతడు ప్రేమలో పడ్డాడు.కొరియోగ్రాఫర్‌తో వివాహంఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించిన చహల్- ధనశ్రీ డిసెంబరు 20, 2020లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, ధనశ్రీ పేరు మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కలిసి వినిపించడం.. గ్లామర్లోనూ ఆమె హీరోయిన్లకు ధీటుగా ఫొటోలు షేర్ చేయడం.. తదితర పరిణామాల నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు వచ్చింది. విడాకులు తీసుకోవడమే తరువాయి అన్నట్లు వార్తలు రాగా.. చహల్- ధనశ్రీ అప్పట్లో సంయుక్తంగా విడాకుల విషయాన్ని ఖండించారు.అనంతరం ఇద్దరూ కలిసి ట్రిప్పులకు వెళ్లిన ఫొటోలు, ప్రత్యేకమైన సందర్భాలను కలిసి జరుపుకొన్న వీడియోలు షేర్ చేస్తూ.. తమ మధ్య విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు. అయితే, తాజాగా మరోసారి వీరు విడిపోతున్నారనే ప్రచారం(Divorce Rumours) ఊపందుకుంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో చహల్- ధనశ్రీ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసిన చహల్ఇటీవల తమ వివాహ వార్షికోత్సవం(డిసెంబరు 22)న కూడా ఇద్దరూ ఎటువంటి పోస్ట్ పెట్టలేదు. అంతేకాదు.. చహల్ ధనశ్రీతో తన పెళ్లి ఫొటోలతో పాటు వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. మరోవైపు.. ధనశ్రీ ఖాతాలో చహల్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ప్రస్తుతానికి అలాగే ఉన్నా అవి ప్రమోషన్లలో భాగంగా తీసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి బంధం బీటలు వారిందనే సంకేతాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే.. చహల్ చివరగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మెగా ఈవెంట్ల ఒక్క మ్యాచ్‌లోనూ చహల్ ఆడకపోయినప్పటికీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో ఉన్న కారణంగా ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 18 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది.చదవండి: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహం -
గ్లామర్‌లో హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ధనశ్రీ వైరల్ ఫొటోలు
-
గ్లామర్‌తో మతిపోగొడుతున్న చహల్ సతీమణి.. ధనశ్రీ లేటెస్ట్ ఫొటోలు
-
టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!
టీమిండియా స్పిన్నర్ చాహల్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్, ఫన్ మూమెంట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ చాలామంది స్టార్ క్రికెటర్లతో ఇతడికి మంచి బాండింగ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారబోతుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లోనూ ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. డ్యాన్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా డ్యాన్స్ కచ్చితంగా రావాల్సిన హీరోయిన్ పాత్ర ఉంది. దాని కోసమే ధనశ్రీని అడగ్గా.. ఆమె ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు సమాచారం. ఏదేమైనా టీమిండియా క్రికెటర్ భార్య.. టాలీవుడ్లో హీరోయిన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా!(ఇదీ చదవండి: మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ కొడుకు) -
కుట్టు మిషన్‌తో క్యూట్ ఫోజులు.. చహల్ భయ్యాకు ఆర్సీబీ జెర్సీ కావాలి వదినా (ఫొటోలు)
-
గ్లామర్‌లో హీరోయిన్లకు పోటీ.. టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
‘మరో ఏడాది.. మరింత అద్భుతంగా’: భార్యకు భారత క్రికెటర్ విషెస్(ఫొటోలు)
-
చహల్‌కు విషెస్.. నీ బిగ్గెస్ట్ చీర్ లీడర్ నేనే అంటున్న భార్య (ఫొటోలు)
-
కళ్లు చెదిరే అందం.. టీమిండియా స్టార్ భార్య ఫొటోలు వైరల్
-
మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)
-
అనుష్క శర్మతో ఫొటోలకు ఫోజులిచ్చిన ధనశ్రీ.. ఈసారి
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి వైరల్‌గా మారారు. పాకిస్తాన్‌పై భారత జట్టు విజయం నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్-2024కు ఎంపికైన భారత జట్టులో చహల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. దీంతో చాలాకాలం తర్వాత అతడు జాతీయ జట్టులో తిరిగి అడుగుపెట్టాడు.అయితే, గ్రూప్ దశలో భాగంగా టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో చహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌ల నేపథ్యంలో తుదిజట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.ఈ రెండు మ్యాచ్‌లలోనూ భారత జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకే పెద్దపీట వేసింది. అదే విధంగా ముగ్గురు స్పెషలిస్టు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లతో బరిలోకి దిగింది.ఇదిలా ఉంటే.. యజువేంద్ర చహల్‌తో పాటు అతడి భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కూడా అమెరికా వెళ్లారు. వీరితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం తర్వాత ధనశ్రీ వర్మ ఓ ఫొటో షేర్ చేశారు. ‘‘మనం గెలిచేశాం’’ అన్న క్యాప్షన్‌తో పంచుకున్న ఈ ఫొటోలో.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ధనశ్రీ విక్టరీ సింబల్ చూపుతూ కనిపించారు.కాగా యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆమె ట్రోలింగ్ బారిన పడ్డారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె పేరును ముడిపెట్టి దారుణంగా ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు.కేవలం ఫేమ్ కోసమే చహల్‌ను ధనశ్రీ పెళ్లాడారని.. అతడికి అన్యాయం చేసేందుకు ఆమె ఏమాత్రం వెనుకాడంటూ వ్యక్తిత్వ హననం చేసేలా కామెంట్లు చేశారు. విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ప్రచారం చేశారు. అయితే, ఆ సమయంలో చహల్ భార్యకు అండగా నిలిచాడు. ధనశ్రీ సైతం ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చి మానసికంగా తాను స్ట్రాంగ్ అని చెప్పకనే చెప్పారు.ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బౌలింగ్👉టీమిండియా స్కోరు: 119 (19)👉పాకిస్తాన్ స్కోరు: 113/7 (20)👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'ఆమెతో ఉన్నదెవరు?'
ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది.. అలా ప్రేమ పక్షులకు పెద్దలనొప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి చందన- కరణ్ శర్మ 13 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల సమ్మతితో జైపూర్‌లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మార్చిలో పెళ్లిపీటలెక్కిన ఈ జంట వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సురభి.. స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో జలకాలాటలు ఆడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.రోజుకో వ్యక్తితో..ఇది చూసిన కొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. సురభిని.. క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీగా పొరపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే నీ జీవితమే వేస్ట్ అవుతుంది. డిప్రెషన్లోకి వెళ్లిపోతావు. తను రోజుకో వ్యక్తితో ఎంజాయ్ చేస్తుంది' అని ఓ యూజర్ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరో నెటిజన్.. 'ఈమె ధనశ్రీయా? నమ్మలేకపోతున్నాను.. సారీ చాహల్.. నువ్వు ఆమెను భాగస్వామిగా ఎంచుకుని తప్పు చేశావు' అని రాసుకొచ్చాడు.చాహల్‌ను ట్యాగ్ చేస్తూ..మరో వ్యక్తి ఏకంగా చాహల్‌ను ట్యాగ్ చేస్తూ.. 'నిన్ను ట్యాగ్ చేస్తున్నందుకు వెరీ సారీ.. కానీ చూశావ్‌గా.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది. అసలు ఇలా ఎవరైనా చేయగలరా?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధనశ్రీతో ఉన్న వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఇది చూసిన నటి అభిమానులు.. ఆమె ధనశ్రీ కాదు.. నటి సురభి చందన అని కామెంట్స్‌తో క్లారిటీ ఇస్తున్నారు.సీరియల్ కెరీర్సురభి చందన విషయానికి వస్తే.. 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'ఖుబూల్ హై', 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్ చిత్రంతో వెండితెరపైనా మెరిసింది. కరణ్ శర్మ.. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే ధారావాహికలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: OTT: ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు.. వీకెండ్లో ఓ లుక్కేయండి! -
IPL 2024: భర్తను చీర్ చేసేందుకు వచ్చిన ధనశ్రీ వర్మ.. లేటెస్ట్ పిక్స్
-
నేనొక ఫైటర్.. వెనకడుగు వేయను: ధనశ్రీ వర్మ
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన భర్త చాహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ధనశ్రీ తను చేసిన ఓ పని వల్ల విపరీతమైన ట్రోల్స్‌కు గురైంది. ధనశ్రీ.. హిందీ పాపులర్ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగింది. ఈ షో ఫైనల్ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌తో ధనశ్రీ వర్మ అత్యంత సన్నిహతంగా దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీంతో ధనశ్రీని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. భర్తను మోసం చేస్తూ ఇలాంటి పనులు చేయడం సరికాదని, నీకు పెళ్లైందని గుర్తుపెట్టుకో అంటూ కామెంట్లు చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ ధనశ్రీ వర్మ ఓ వీడియో విడుదల చేసింది. "అస్సలు మీరు ఎలా ఏదో ఏదో ఊహించుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు దయచేసి మనుషులగా ఆలోచించండి. నేను ట్రోల్స్, మీమ్స్‌ను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ పోతాను. కొన్నిసార్లు ఇటువంటి వాటిని చూసి నాలో నేను నవ్వుకుంటాను. కానీ ఈ సారి ఈ చెత్త ట్రోల్స్‌పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి అవి నా కుటుంబాన్ని, నా సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సోషల్ మీడియా వేదికల్లో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అందరికి ఉంది. కానీ ఇతరుల వ్యక్తి గత జీవితాన్ని టార్గెట్ చేసి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. కొంత మంది ద్వేషాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. నా పనిలో సోషల్ మీడియా ప్రధాన భాగం కాబట్టి నేను విడిచిపెట్టలేను. కాబట్టి మీరు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి.. మా ప్రతిభ, నైపుణ్యాలను గమనించాలని కోరుతున్నా. మేమంతా మిమ్మల్ని అలరించడానికే సోషల్ మీడియాలో ఉన్నాము. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్య లాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి. నేను ఒక పోరాట యోధురాలిని. .ఏ విషయానికి భయపడి వెనకడుగు వేయను. ఇకనైనా ఈ వేదికగా ప్రేమను పంచండి. కాస్త సున్నితంగా వ్యవహరించండి. విద్వేషం వ్యాప్తి చేయకండి. మంచి విషయాలపై దృష్టి మీ జీవితంలో ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాని ధనశ్రీ పేర్కొంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
చహల్ భార్య ధనశ్రీ వర్మ చార్మింగ్ లుక్స్ (ఫొటోలు)
-
అతడితో చహల్ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా?
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘‘చహల్ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?! టీమిండియా బౌలర్‌గా కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్‌కు అప్పట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్‌కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్చర్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్)గా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఝలక్ దిఖ్లా జా షోలో ఫైనల్స్ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్లో ఫైనల్ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీని అందుకున్నారు. What will be the Dhanashree Verma reaction if Yuzvendra Chahal does this constantly with his ladies friends ? We all are human and any husband who loves his wife will be hurt by these incidents. This is utter nonsense, and needs to be stopped. pic.twitter.com/xKW2tf7K9v — Sujeet Suman (@sujeetsuman1991) March 2, 2024 I wouldn't post such an intimate pic on instagram even if it was with my wife #ShameOnDhanshree #YuziChahal pic.twitter.com/9pEhXEmtAi — brigadier🇮🇳 (@brigadierdude) March 2, 2024 -
Dhanashree Verma Pics: కొత్త సంవత్సరం వేళ చహల్ భార్య ధనశ్రీ ఇలా..గ్లామర్ ఫొటోలు
-
పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం
‘‘నా ప్రియమైన సతీమణి... మనం మొట్టమొదటిసారి కలిసిన రోజు నుంచి ఈ క్షణం దాకా.. ఈ ప్రయాణంలోని ప్రతీ సెకండ్ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. ఈ మాట ఎవరు చెప్పారో గానీ.. సరిగ్గా నా కోసం చెప్పినట్లే ఉంది. ప్రతి రోజు నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకునేలా చేస్తున్నావు. నీ రాకతో నేను సంపూర్ణమయ్యాను!! నా ప్రేమ దేవతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అంటూ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ పట్ల ప్రేమను చాటుకున్నాడు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణికి కవితాత్మక సందేశాన్ని బహుమతిగా ఇచ్చాడు. Dear wifey , From the first day we met to this moment, every second of this journey has been close to my heart. They say matches are made in heaven and I am sure whoever has written our script is on my side 💕 You make me a better human being every single day.❤️ You complete… pic.twitter.com/1xxe8KqfSt — Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2023 ఈ సందర్భంగా తన నిచ్చెలితో దిగిన అందమైన ఫొటోలను యుజీ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా ధనశ్రీ సైతం.. ఓ పాటకు తామిద్దరం డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. మూడేళ్లుగా పరస్పర సహకారంతో తమ ప్రయాణం ఇక్కడిదాకా వచ్చిందంటూ భర్త పట్ల ఆప్యాయతను చాటుకుంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) కాగా టీమిండియా బౌలర్‌గా కెరీర్లో తారస్థాయిలో ఉన్న సమయంలో యూట్యూబర్ ధనశ్రీ వర్మను చహల్ పెళ్లాడాడు. 2020, డిసెంబరు 22న గూర్గావ్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే, కొన్నాళ్ల క్రితం ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తొలగించడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చాయి. అంతేకాదు.. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ పేరును ముడిపెట్టి అసభ్యకరమైన రీతిలో ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు. ఈ క్రమంలో యజువేంద్ర చహల్ స్వయంగా స్పందించి విడాకుల రూమర్స్‌ను కొట్టిపడేశాడు. ధనశ్రీ సైతం భర్తతో కలిసి ఉన్న వీడియో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టింది. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) ఇదిలా ఉంటే.. టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ పెళ్లిరోజు కూడా నేడు. ఈ సందర్భంగా సతీమణికి విష్ చేస్తూ అందమైన ఫొటోలను పంచుకున్నాడు సంజూ. కాగా తన చిన్ననాటి స్నేహితురాలు చారులతా రమేశ్‌ను ఐదేళ్ల క్రితం వివామమాడాడు సంజూ. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఈ కేరళ బ్యాటర్ మూడో వన్డేలో శతకం బాది టీమిండియాను గెలిపించాడు. మరోవైపు.. చహల్‌కు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చదవండి: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ! -
అయ్యర్ భారీ సిక్సర్! ఆమె రావడం మంచిదైంది.. కానీ! ప్రతిభను గుర్తించరా?
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం నుంచి స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌట్ అయిన ఈ ముంబై ఆటగాడు.. అఫ్గనిస్తాన్‌పై 25(నాటౌట్) పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో అజేయ అర్ధ శతకం(53)తో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మరోసారి విఫలమై(19) పాత కథ పునరావృతం చేశాడు. అనంతరం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరి మళ్లీ నిరాశ పరిచాడు. తప్పించాలంటూ డిమాండ్లు దీంతో నిలకడలేని ఫామ్‌తో సతమవుతున్న అయ్యర్‌పై వేటు వెయ్యాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో.. సొంతమైదానం వాంఖడేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఒక్క ఇన్నింగ్స్‌తో దిమ్మతిరిగేలా సమాధానం పూర్తి ఆత్మవిశ్వాసం కనబరుస్తూ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. సెంచరీ దిశగా పయనిస్తున్నాననే జాగ్రత్త పడకుండా నిస్వార్థ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. శుబ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లి (88)లు అవుటైన తర్వాత వేగవంతమైన ఆట తీరుతో టీమిండియా 357 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారీ సిక్సర్‌తో రికార్డు ఈ క్రమంలో విమర్శించిన వారే అయ్యర్‌ను ప్రశంసిస్తూ అద్భుత ఇన్నింగ్స్ అంటూ కొనియాడుతుండటం విశేషం. ఇదిలా ఉంటే.. లంకతో మ్యాచ్ సందర్భంగా ఈ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అతి భారీ సిక్సర్‌ను నమోదు చేశాడు. కసున్ రజిత బౌలింగ్‌లో 106 మీటర్ల సిక్స్‌ను బాది చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక.. ఓవైపు అయ్యర్ షాట్ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చహల్- ధనశ్రీలపైకి బంతి విషయమేమిటంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్.. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి గురువారం వాంఖడే మైదానానికి వచ్చాడు. అయితే, అయ్యర్ బాదిన భారీ సిక్సర్ ఈ దంపతులు కూర్చున్న స్టాండ్స్‌లో ల్యాండ్ అవడం విశేషం. శ్రుతిమించిన ట్రోల్స్ దీంతో.. ‘‘పాపం చహల్‌పై అంత కోపమెందుకు అయ్యర్.. ఏదేమైనా ధనశ్రీ రావడంతో అయ్యర్‌కు లక్ కలిసివచ్చినట్లుంది’’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధనశ్రీతో కలిసి అయ్యర్ డ్యాన్స్ చేసిన వీడియోలు, వీరిద్దరు కలిసి పార్టీలకు హాజరైన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తీసేసినపుడు.. అయ్యర్ పేరుతో ఆమె పేరును జతచేసి దారుణంగా ట్రోల్ చేశారు. అంతటితో ఆగక చహల్‌తో ధనశ్రీ విడిపోబోతుందంటూ వదంతులు వ్యాప్తి చేయగా.. చహల్ స్వయంగా వీటిని ఖండించాడు. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిగో మళ్లీ ఇప్పుడిలా ఈ సిక్సర్ కారణంగా వాళ్లిద్దరిని ట్రోల్ చేస్తూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. అయితే, అయ్యర్ ఫ్యాన్స్ మాత్రం వీటిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిభను గుర్తించకుండా అనవసరపు విషయాల్లోకి లాగి అయ్యర్ ఆటను తక్కువ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. -
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ధనశ్రీ వర్మ అందమైన ఫొటోలు చూసేయండి
-
అందమైన ఫోటోలు షేర్ చేసిన ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ ఫిదా!
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య, ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె మంచి డ్యాన్సర్ కూడా. ధనశ్రీ ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ వీడియాలు, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హాలీవుడ్ కొత్త మూవీ 'బార్బీ' చూడటానికి ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్స్‌ను ధరించింది. ఈ ప్రత్యేక దుస్తుల్లో ఆమె మెరిసిపోయింది. ధనుశ్రీ కొత్త లూక్‌కు సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధనుశ్రీ పోస్టుపై చాహల్ కూడా స్పందించాడు. హార్ట్, ముద్దు ఎమోజీలను చాహల్ రిప్లేగా ఇచ్చాడు. కాగా చాహల్ ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్నాడు. విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల్లో చాహల్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. చదవండి: Virat Kohli: కోహ్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న విండీస్ క్రికెటర్ తల్లి.. వీడియో వైరల్ -
భార్య ధనశ్రీతో చహల్.. చూడముచ్చటైన జంట (ఫొటోలు)
-
శ్రేయస్‌తో చహల్ భార్య ధనశ్రీ తాజా ఫొటో వైరల్! కలిసి వెళ్లేది అందుకేనా?
Shreyas Iyer- Yuzvendra Chahal- Dhanashree Verma: గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. భారత స్టార్ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ కీలక బౌలర్ యజువేంద్ర చహల్ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మతో అయ్యర్ కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ధనశ్రీ స్వయంగా శనివారం తన ఇన్‌స్టా స్టోరీలో వీటిని షేర్ చేయడం గమనార్హం. ‘‘మై క్యూటీస్’’ అంటూ హార్ట్ ఎమోజీతో తన స్నేహితురాలు పంచుకున్న ఫొటోను చహల్ సతీమణి షేర్ చేసింది. ఇందులో ఆమె స్నేహితులతో పాటు ఓ మూలన అయ్యర్ కూడా కనిపించాడు. ఇందులో శ్రేయస్ సోదరి శ్రేష్ట అయ్యర్ కూడా ఉండటం విశేషం. కాగా గతంలో.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్- దేవిషా దంపతులతో ధనశ్రీ, శ్రేయస్ దిగిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. విడాకుల రూమర్లు అంతకుముందే ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి చహల్ ఇంటి పేరును తొలగించడం.. తర్వాత ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో విడాకుల రూమర్లు గుప్పుమన్నాయి. దీంతో స్వయంగా చహల్- ధనశ్రీ స్పందిస్తూ పుకార్లకు అడ్డుకట్ట వేశారు. అయితే, ఇటీవల టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లిలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ- రితికా దంపతులతో కలిసి ధనశ్రీ- శ్రేయస్ దిగిన ఫొటోలతో మరోసారి వీరు నెట్టింట ట్రెండ్ అయ్యారు. తాజాగా స్నేహితుల ఇంట్లో జరిగిన ఇఫ్తార్ పార్టీకి శ్రేయస్, శ్రేష్టతో పాటు ధనశ్రీ కూడా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మళ్లీ వీరి పేర్లు హైలైట్ అవుతున్నాయి. కలిసి వెళ్లేది అందుకేనా.. డాక్టర్ ధనశ్రీ వర్మ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. అలాగే కొరియోగ్రాఫర్ కూడా! నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియాగ్రాఫర్‌గా రాణించాలని కలలు కంటోంది. ఈ క్రమంలో వీరిద్దరికి స్నేహం కుదరగా.. శ్రేయస్‌తో కూడా ధనశ్రీ ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిందని టాక్. ఇప్పటికే అయ్యర్‌తో గతంలో ఓ డాన్స్ వీడియో షేర్ చేసిన ధనశ్రీ అతడి ఆట తీరును ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో కొంతమంది అయ్యర్‌తో ధనశ్రీ స్నేహాన్ని విమర్శిస్తూ కామెంట్లు చేస్తుండగా.. అభిమానులు మాత్రం తన ఫ్రెండ్ సోదరుడితో ధనశ్రీ ఫ్రెండ్షిప్ చేస్తే పెడర్థాలు తీస్తారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా.. ఏదో రకంగా వార్తల్లో ఉండటం ధనశ్రీకి పరిపాటి అయిందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. తను దొరకడం నా అదృష్టం ధనశ్రీ వీలు చిక్కినప్పుడల్లా భర్త చహల్‌తో కలిసి ప్రయాణాలు చేస్తుంది. అతడిని ప్రోత్సహిస్తూ భర్త సాధించే విజయాలను ఆస్వాదిస్తుంది. ఇటీవల సన్‌రైజర్స్‌తో హైదరాబాద్‌లో రాజస్తాన్ మ్యాచ్‌కు విచ్చేసిన ధనశ్రీ.. చహల్ వికెట్లు తీసినపుడు సెలబ్రేషన్ చేసుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. ఇక మ్యాచ్ తర్వాత చహల్ మాట్లాడుతూ.. తన భార్య గురించి గొప్పగా చెబుతూ.. ఆమెలాంటి జీవిత భాగస్వామి దొరకడం అదృష్టమని పొంగిపోయాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో చహల్ బిజీగా ఉన్న సమయంలో ధనశ్రీ ఫొటోలు షేర్ చేసింది. -
తనకు అన్నీ తెలుసు.. ఎక్కడ బాల్ వేస్తానో కూడా అంచనా వేయగలదు!
IPL 2023- Yuzvendra Chahal- Dhanashree Verma: ‘‘తను నాతో ఉంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మరింత కాన్ఫిడెంట్‌గా ఉంటాను. తనే నా బలం. తన ఉనికి నాలో సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. నేను మ్యాచ్ ఆడే సమయంలో తను స్టాండ్స్‌లో ఉండటం నాకిష్టం. తను నన్ను చూసి చిరునవ్వులు చిందిస్తూనే నా ఆట తీరును నిశితంగా పరిశీలిస్తుంది. నేనెలా బౌలింగ్ చేస్తున్నానో గమనిస్తుంది. కొన్నిసార్లు నేను బాల్ ఎక్కడ వేస్తానో కూడా ముందే అంచనా వేస్తుంది. గత కొన్ని వారాల క్రితం నాకు ఈ విషయం తెలిసింది. తను నా పక్కన ఉంటే చాలు. అంతకంటే ఇంకేమీ అవసరం లేదు’’ అంటూ టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తన భార్య ధన శ్రీ వర్మ ఎల్లవేళలా తనకు మద్దతుగా ఉంటుందంటూ ఆమెపై ఇలా ప్రేమను చాటుకున్నాడు. కాగా యూట్యూబర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని చహల్ ప్రేమించి పెళ్లాడాడు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. విడిపోతోందంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి చహల్ ఇంటిపేరు తొలగించడం, శ్రేయస్ అయ్యర్‌తో దిగిన ఫొటోలు వైరల్ కావడం ఇందుకు కారణం. అయితే, వాటన్నిటికీ చెక్ పెడుతూ తాము కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని ప్రకటించి చహల్- ధనశ్రీ దంపతులు అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు. ఇక చహల్ ఎప్పుడు మ్యాచ్ ఆడినా ధనశ్రీ అతడి వెంటే ఉంటుంది. భర్తను చీర్ చేస్తూ అతడి ఘనతలు చూసి పొంగిపోతుంది. ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా కూడా ధనశ్రీ ఉప్పల్ స్టేడియానికి విచ్చేసింది. అతడి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. ఈ క్రమంలో భార్య సపోర్టు గురించి చహల్ మాట్లాడిన వీడియోను రాజస్తాన్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారని పేర్కొంది. Goals! 💗💗💗 pic.twitter.com/EKT7nDBHsd — Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023 💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
భర్త ఘనతను దగ్గరుండి ఎంజాయ్ చేసిన ధనశ్రీ
ఐపీఎల్ 16వ సీజన్‌ను యజ్వేంద్ర చహల్ ఘనంగా ఆరంభించాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఈ రాజస్తాన్ బౌలర్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఈ నేపథ్యంలో చహల్ తన ఖాతాలో రెండు రికార్డులను జమ చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన చహల్‌కు టి20ల్లో ఇది 300వ వికెట్. టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఏకకాలంలో రికార్డు సాధించాడు. కాగా చహల్ సాధించిన ఈ ఘనతను భార్య ధనశ్రీ వర్మ ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌కు ధనశ్రీ వర్మ హాజరైంది. భర్త టి20ల్లో 300వ వికెట్ సాధించగానే స్టాండ్స్‌లో ఉన్న ధనశ్రీ ఒక్కసారిగా సంతోషంతో గెంతులేసి చప్పట్లతో చహల్‌కు అభినందనలు పంపించింది. ఈ సమయంలో ఆమె మొహం నవ్వుతో వెలిగిపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు.. చహల్‌కు ఇంతలా సపోర్ట్ చేసే భార్య దొరకడం నిజంగా అతని అదృష్టం అని మనసులో అనుకునే ఉంటారు. ధనశ్రీ ఎంజాయ్ చేస్తున్న వీడియోపై మీరు ఒక లుక్కేయండి. 💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
నెట్టింట చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోలు వైరల్.. ఈసారి కూడా!
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి, యూట్యూబర్ ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిగత అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుందామె. ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీకి యాభై లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె పోస్టులకు లక్షల్లో లైకులు రావడం సహా అదే స్థాయిలో కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడుతుందామె. గతంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్- దేవిషా శెట్టి దంపతులతో పాటు.. మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె దిగిన ఫొటో పలు అనుమానాలకు తావిచ్చింది. అప్పటికే తన ఇన్‌స్టా అకౌంట్లో ధనశ్రీ భర్త ఇంటి పేరును తొలగించడం.. ఆపై ఇలా వేరే క్రికెటర్‌తో కలిసి కనిపించడంతో విడాకుల వార్తలు తెరమీదుకు వచ్చాయి. చహల్- ధనశ్రీ స్వయంగా తాము కలిసే ఉంటున్నామని చెప్పిన తర్వాతే రూమర్లకు అడ్డుకట్ట పడింది. తాజాగా.. టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ సంగీత్‌లో పాల్గొన్న ధనశ్రీ షేర్ చేసిన ఫొటోలు మరోసారి నెట్టింట చర్చకు దారితీశాయి. పెళ్లికొడుకు శార్దూల్‌తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- రితికా సజ్దే దంపతులు, ధనశ్రీ, శ్రేయస్ అయ్యర్ ఫొటో దిగారు. వీటిని ఇన్‌స్టాలో పంచుకున్న ధనశ్రీ 5 ఎక్స్ పవర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేసింది. దీంతో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘చహల్ భాయ్ ఎక్కడ? మీరు ప్రతిసారి భాయ్‌ను కావాలనే అవాయిడ్ చేస్తారా? రూమర్లు రావాలని కోరుకుంటారా? అప్పుడు ఆ ఫొటోలతో.. ఇప్పుడు ఈ ఫొటోలతో ఎందుకిలా వదినమ్మా? చహల్ భయ్యా కూడా ఉంటే బాగుండేది’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అప్పుడలా.. ఇప్పుడలా? ఏదో మతలబు ఉంది’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలా ధనశ్రీ పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. స్వదేశంంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో చహల్‌కు చోటు దక్కలేదు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? T20 WC 2023: అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు! View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
రూమర్లకు చెక్! అందమైన వీడియో షేర్ చేసిన టీమిండియా క్రికెటర్!
Yuzvendra Chahal- Dhanashree Verma Video Viral: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ తన భార్య ధనశ్రీ వర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘అత్యంత శక్తిమంతమైన మహిళ.. తనే నా బలం’’ అంటూ సతీమణితో గడిపిన అందమైన క్షణాల తాలూకు దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. ‘రూమర్లకు పర్ఫెక్ట్ చెక్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. విడిపోతున్నారంటూ వదంతులు! కాగా టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ ఒంటరిగా హాజరైన నేపథ్యంలో చహల్‌తో ఆమెకు విభేదాలంటూ వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో దిగిన ఫొటో కారణంగా ధనశ్రీపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. చహల్- ధనశ్రీ విడిపోబోతున్నారంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. అందమైన వీడియోతో ముందుకు వచ్చిన చహల్! ఈ నేపథ్యంలో చహల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఇలాంటివి నమ్మవద్దని ఈ భారత బౌలర్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా మరోసారి.. వదంతులు వ్యాప్తి చేసిన వారికి కౌంటర్‌గా భార్యతో కలిసి ఉన్న వీడియోను పంచుకున్నాడు. ఇక షేర్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే నాలుగు లక్షలకు పైగా లైక్ సాధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా చహల్ టీ20 వరల్డ్‌కప్-2022కు ఎంపికైన విషయం తెలిసిందే. అంతకంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగం కానున్నాడు. సెప్టెంబరు 20 నుంచి ఆసీస్‌తో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు చహల్. ఇదిలా ఉంటే.. ధనశ్రీ వర్మ యూట్యూబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. వీరి వివాహం 2020లో అంగరంగ వైభవంగా జరిగింది. చదవండి: బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న శాంసన్ ఫ్యాన్స్.. ఎప్పుడంటే? T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)