ధనశ్రీ- చాహల్ మళ్లీ కలవబోతున్నారా?.. క్రికెటర్ రియాక్షన్‌ ఇదే..! | Yuzvendra Chahal reacts to reunion rumours with ex wife Dhanashree Verma | Sakshi
Sakshi News home page

Dhanashree Verma: ధనశ్రీ- చాహల్ మళ్లీ కలవబోతున్నారా?.. క్రికెటర్ రియాక్షన్‌ ఇదే..!

Jan 14 2026 3:30 PM | Updated on Jan 14 2026 3:45 PM

Yuzvendra Chahal reacts to reunion rumours with ex wife Dhanashree Verma

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్‌ యుజ్వేందర్ చాహల్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని తమ బంధానికి ముగింపు పలికారు. గతేడాది అఫీషియల్‌గా విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ వర్క్ లైఫ్‌తో బిజీగా ఉన్నారు.  

ఈ నేపథ్యంలో ఈ విడిపోయిన జంటపై నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట మరోసారి కలవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే మళ్లీ కలిసి జీవించడానికి కాదు.. ఓ రియాలిటీ షో కోసమట. చాహల్- ధనశ్రీ వర్మ ది -50 అనే రియాలిటీ షోలో కనిపించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్రికెటర్‌ చాహల్ స్పందించారు.

అయితే తామిద్దరు కలుస్తామన్న వార్తలను చాహల్ కొట్టిపారేశారు. తమ వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని క్రికెటర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్రికెటర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో  ఎలాంటి నిజం లేదని.. కేవలం ఊహాజనితం, తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు. అయితే ఈ రూమర్స్‌పై ధనశ్రీ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. కాగా.. ది -50 అనే రియాలిటీ షో ఫిబ్రవరి 1న ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు చిత్రనిర్మాత ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement