
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే క్రికెటర్ చాహల్ పెళ్లాడిన ఆమె.. కొన్నేళ్లకే వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 2020లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్, ఆర్జే మహ్వశ్తో డేటింగ్లో ఉన్నట్లు కథనాలొచ్చాయి. వీరిద్దరు తమ వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు స్పందించలేదు.
అయితే చాహల్తో విడాకుల తర్వాత మాజీ భార్య ధనశ్రీ వర్మ ఈ విషయంపై మాట్లాడింది. రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో పాల్గొన్న ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత తనను చాలా అగౌవరంగా మాట్లాడారని గుర్తు చేసుకుంది. అయితే తాను తిరిగి చాహల్ పట్ల అగౌరవపరిచేలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఎందుకంటే ఒకప్పుడు అతను నా భర్త కావడం వల్లే తనకు గౌరవం ఉందని పేర్కొంది.
మీరు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు.. ఇతరులను గౌరవించడం కూడా మీ చేతుల్లో ఉంటుందని ధనశ్రీ వర్మ అన్నారు. ఒక మహిళగా నాకు ఈ విషయాలు చెప్పే హక్కు లేదా? అని ప్రశ్నించారు. అతను నా భర్త.. నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా చాహల్ను గౌరవించానని తెలిపింది. మన ఇమేజ్ కోసం ఇతరులను తక్కువ చేయాల్సిన అవసరం లేదన్నారు. నాపై ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా.. ఎంత బ్యాడ్గా చెప్పినా.. మీ టైమ్ వేస్ట్ తప్ప ఎలాంటి ఫలితం ఉండదని ధనశ్రీ వర్మ పేర్కొన్నారు.