బిగ్‌బాస్‌కు వచ్చినవాళ్లు అంతో ఇంతో నెగెటివిటీ మూటగట్టుకుని వెళ్లిపోతుంటారు. కానీ రీతూ మాత్రం నెగెటివిటీతో వచ్చి పాజిటివ్‌గా బయటకు వెళ్లింది. డిమాన్‌తో తన అనుబంధంపై జనాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ నిజాయితీగా ఉందని ఫీలయ్యారు. అలా ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఫైనల్స్‌లో ఉంటుందనుకుంటే ఊహించని విధంగా డిసెంబర్ 7న ఎలిమినేట్ అయింది. మరి ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం..
టాప్ 5లో ఉండట్లే, ఓడిపోయా..
రీతూ ఎలిమినేట్ అనగానే తనూజ షాకైపోగా.. డిమాన్ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ, రీతూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. టాప్ 5లో ఉండట్లేదు, ఓడిపోయానని చిన్నపిల్లలా ఏడ్చింది. పవన్‌ను అందరూ జాగ్రత్తగా చూసుకోండి, రెండు వారాలు వాడితో ఉండండి, మాట్లాడండి అంది. కల్యాణ్, నువ్వు ఎక్కువగా మాట్లాడట్లేదని పవన్ ఫీలవుతున్నాడు.. మాట్లాడు అని సూచించింది. వెళ్లిపోయేముందు రీతూ చెవిలో పవన్ కప్పు గెలిచి వస్తా.. అని గుసగుసలాడాడు. దీంతో ఆమె బాగా ఆడు అని మోటివేట చేసింది.
రీతూ టాప్ 5 ఇదే..
తర్వాత స్టేజీపైకి వెళ్లిన రీతూ (Rithu Chowdary).. తన అభిప్రాయం ప్రకారం హౌస్‌మేట్స్‌ను టాప్ 7లో పెట్టింది. పవన్‌ను ఫస్ట్ ప్లేస్‌లో, తనూజ, ఇమ్మాన్యుయేల్‌ను రెండు, మూడు స్థానాల్లో, కల్యాణ్‌ను నాలుగో స్థానంలో పెట్టింది. ఏదైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ సంజనను ఐదో స్థానంలో పెట్టింది. ఆరో స్థానంలో సుమన్, ఏడో స్థానంలో భరణిని పెట్టింది.


