టార్గెట్‌ 'తనూజ'.. బిగ్‌బాస్‌ ఇదేం 'ట్రై యాంగిల్‌' | Netizens Comments On Bigg boss 9 telugu team For thanuja | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 'తనూజ'.. బిగ్‌బాస్‌ ఇదేం 'ట్రై యాంగిల్‌'

Dec 7 2025 5:45 PM | Updated on Dec 7 2025 5:52 PM

Netizens Comments On Bigg boss 9 telugu team For thanuja

బిగ్‌బాస్‌ తెలుగు 9 చివరిదశకు చేరుకుంది.  నేడు జరగనున్న ఎలిమినేషన్‌ తర్వాత టాప్‌-5లో ఉండే కంటెస్టెంట్స్‌ ఎవరు అనేది తేలనుంది. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్‌ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తనూజను కావాలనే బిగ్‌బాస్‌ టీమ్‌ టార్గెట్‌ చేస్తుందని స్టార్‌ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్‌ టీమ్‌ వాటిని కూడా హైడ్‌ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్‌ షాట్స్‌ కూడా ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.

ట్రై యాంగిల్‌ (త్రిభుజాకారం)తో రచ్చ
బిగ్‌బాస్‌ గేమ్‌లో భాగంగా  ట్రై యాంగిల్‌ ఆకారంలో ఉన్న వస్తువును ఒకే వరుసలో ఉంచాలని, అవన్నీ ఒకే సైజ్‌లో ఉండాలని రూల్‌ పెట్టారు. అయితే, రీతూ ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్‌లో లేదని మొదట తనూజ పాయింట్‌ పెడుతుంది. దీంతో అదే గేమ్‌లో రీతూతో తలపడి ఓడిపోయిన భరణి ఫైర్‌ అయిపోతాడు. కానీ, తనూజ ఎక్కడా కూడా నోరు జారలేదు. తన సందేహం మాత్రమే చెప్పింది. అదే బిగ్‌బాస్‌కు నచ్చినట్లు లేదు.

బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు
ట్రై యాంగిల్‌ (త్రిభుజాకారం) పాయింట్‌ గురించి ఈ శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాగార్జున కూడా మాట్లాడారు. అయితే, తనూజను టార్గెట్‌ చేస్తూ బిగ్‌బాస్‌ టీమ్‌ రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తనూజ తప్పులేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్‌బాస్‌ టీమ్‌  రెచ్చిపోయిందని అంటున్నారు. గ్రూప్‌ గేమ్‌ ఆడిన ఇమ్ము, కల్యాణ్‌ల గురించి నాగ్‌ ప్రశ్నించలేదు. రింగ్‌ దాచేసిన రీతూను ఒక్కమాట కూడా అనలేదు. కానీ, తనూజ తప్పులు లేకున్నా సరే ఆమెను బిగ్‌బాస్‌ టార్గెట్‌ చేశారని పోస్టులు చేశారు. దీంతో తనూజ పేరు ఏకంగా ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. ట్రై యాంగిల్‌ను తప్పుగా రెడీ చేశారని నాగార్జునే చెప్పారు. అలాంటప్పుడు తనూజను తిట్టడం ఎందుకు అంటూ నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్‌ రివ్యూవర్లు కూడా తనూజను కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని చెప్పడం విశేషం.  

ఒక టాస్క్‌లో కల్యాణ్‌ కన్నీళ్లు పెట్టుకుంటే .. చాలా ఎమోషనల్‌ అయ్యావ్‌ ఎందుకు అని నాగార్జున ప్రశ్నిస్తారు. మరి తనూజ కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో చాలాతప్పు అన్నట్లుగా నాగార్జున అనడం ఎందుకు అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు.  తనూజ చేసిన చిన్నచిన్న తప్పులను వెతికి మరి బిగ్‌బాస్‌ టీమ్‌ టార్గెట్‌ చేస్తుందని అంటున్నారు. చివరకు ప్రోమోలలో కూడా తనూజను తప్పుగా చూపిస్తారని, ఎపిసోడ్స్‌లో చూస్తే ఏమీ ఉండదని అంటున్నారు. ఇదంతా కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడుతున్నాడని ఫ్యాన్స్‌ అంటున్నారు.
 

https://x.com/phantom242628/status/1994974214286389755?s=20

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement