మేధే మనిషి భవిష్యత్తు! | Nikhil Kamath podcast Elon Musk check full deets inside | Sakshi
Sakshi News home page

మేధే మనిషి భవిష్యత్తు!

Dec 6 2025 4:54 PM | Updated on Dec 6 2025 5:37 PM

Nikhil Kamath podcast Elon Musk check full deets inside

ఏఐ, రోబోటిక్స్‌ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్‌ మస్క్‌. ఆయన నిఖిల్‌ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేశారు. మస్క్‌ మాటల్లోని ముఖ్యాంశాలు:

భారతీయులు ‘ద బెస్ట్‌’
‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్‌–ఏఐ, స్పేస్‌ఎ క్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలు హెచ్‌–1బి వీసాలతో అమెరికన్‌ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్‌–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.

పని అభిరుచి అవుతుంది!
‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్‌ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్‌ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.

ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయ‌లే.. ఎగబడిన జనం ..కట్‌ చేస్తే

డిజిటల్‌ ఫ్రీ... ‘లైవ్‌’ కాస్ట్‌లీ
‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్‌ రియల్‌ –టైమ్‌ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్‌ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్‌ – ఈవెంట్‌’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!

చదవండి : ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన నటి

వితరణలకు పెను సవాళ్లు
‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్‌ ఫౌండేషన్‌’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!

అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’
‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్‌ కాయిన్‌ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన  శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 
ఎడిటోరియల్‌ టీమ్‌

వ్యూ పాయింట్‌: 

పాడ్‌కాస్ట్‌: పీపుల్‌ బై డబ్లు్య.టి.ఎఫ్‌.
అతిథి: ఎలాన్‌ మస్క్, పారిశ్రామికవేత్త
హోస్ట్‌: నిఖిల్‌ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement