పని కేవలం హాబీ మాత్రమే
ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.
ఏఐ వేగాన్ని సూపర్‌సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్‌గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.
అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్‌ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్‌ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.
ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే..


