సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం | Late Sushma Swaraj husband Swaraj Kaushal passes away at 73 daughter emotional message | Sakshi
Sakshi News home page

సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం

Dec 4 2025 6:37 PM | Updated on Dec 4 2025 6:55 PM

 Late Sushma Swaraj husband Swaraj Kaushal passes away at 73 daughter emotional message

న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు. స్వరాజ్ కౌశల్  మాజీ విదేశాంగ మంత్రి  దివంగత సుష్మా స్వరాజ్ భర్త . అలాగే బీజేపీ ఎంపి బన్సూరి స్వరాజ్ తండ్రి.  లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ విభాగం   ప్రకటించింది. 

కౌశల్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సహా, పలువురు బీజేపీ నేతలు  ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు.

తిరిగి అమ్మ దగ్గరికే
బన్సూరి స్వరాజ్ తన తండ్రి  మరణంపై ఒక భావోద్వేగ  ట్వీట్‌ చేశారు. తండ్రిగారు ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ ఇలా రాశారు ‘‘ మీ నిష్క్రమణ   చాలా బాధిస్తోంది. మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో, శాశ్వత శాంతితో తల్లితో తిరిగి కలిశారనే ఈ నమ్మకం. అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు మీ కుమార్తె కావడం నా జీవితంలో గొప్ప గర్వం,, మీ వారసత్వం, మీ విలువలు , మీ ఆశీర్వాదాలు ముందుకు సాగే ప్రతి ప్రయాణానికి పునాదిగా ఉంటాయి." అంటూ బన్సూరి స్వరాజ్ తన తండ్రికి నివాళులర్పించారు.

ఎవరీ స్వరాజ్‌ కౌశల్‌ 
జూలై 12, 1952న సోలన్‌లో జన్మించిన స్వరాజ్ కౌశల్ 1990లో 37 సంవత్సరాల వయసులో మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. భారతదేశంలో నియమితులైన అతి పిన్న వయస్కుడైన గవర్నర్‌గా నిలిచారు. సుప్రీంకోర్టు ఆయనను కేవలం 34 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా నియమించింది. స్వరాజ్ కౌశల్ - సుష్మా స్వరాజ్ 1975లో వివాహం చేసుకున్నారు. కౌశల్ పార్లమెంటులో హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుండి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement