కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్య
మంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓ పెళ్లికి హాజరుకావ డంతోపాటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. బుధవా రం ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళూరు వచ్చిన సిద్ధరామయ్యతో.. డీకే పర్యటన గురించి మీడియా ప్రశ్నించగా.. అధికారికం ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లబోనని స్పష్టం చేశారు. ‘ఆయనను వెళ్లనివ్వండి.
ఎవరైనా ఆయనకు నో చెప్పారా? నేను ఆహ్వానించినప్పుడే వెళ్తాను. నన్ను ఆహ్వానించలేదు, కాబట్టి నేను వెళ్లడం లేదు.’అని స్పష్టం చేశారు. మంగళూరు విమానాశ్రయంలో డీకే డీకే అంటూ మద్దతుదారులు నినాదాలు చేయడంపై ఆయన..‘ఇందులో తప్పేముంది? గత పదేళ్లుగా ప్రజలు ‘డీకే డీకే’అని నినాదాలు చేస్తున్నారు. కొంతమంది ‘మోదీ మోదీ’అని అరుస్తారు. మరికొందరు ‘రాహు ల్ రాహుల్’, ఇంకొందరు ’సిద్దూ సిద్ధూ’అని జపిస్తారు. అందులో తప్పేమీ లేదు. వారు ప్రేమతో నినాదాలు చేస్తారు. దానిని మనం క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి’అని అన్నారు.


