న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం కాలుష్య కాసారంగా మారిపోతుంది. విషపూరితమైన వాయు కాలుష్యంపై ప్రభుత్వం షాకింగ్ డేటాను కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత కేసులు నమోదైనట్టు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం వెల్లడించింది. దీర్ఘకాలిక వాయు కాలుష్య సంక్షోభ తీవ్రత, ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై చూపిస్తున్నప్రభావాన్ని ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బహుళ-నగర అధ్యయనంలో శ్వాసకోశ వ్యాధుల సంఖ్య చాలా తీవ్రంగా ఉందని పేర్కొంది. ఐదు ప్రదాన ఆసుపత్రుల్లలో కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఢిల్లీలోని ఆరు ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు 2022 మరియు 2024 మధ్య అత్యవసర విభాగాలకు 2,04,758 తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ARI) కేసులను నమోదు చేశాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో, 30,420 మంది రోగులు - దాదాపు 15శాతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడింది.
రాజ్యసభ ఎంపీ డాక్టర్ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే (నామినేట్ చేయబడిన) లేవనెత్తిన ప్రశ్న నం. 274 కు సమాధానంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఈ డేటాను సమర్పించారు.
సాహ్నే అడిగిన ప్రశ్నలు
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం మరియు శ్వాసకోశ వ్యాధుల మధ్య సంబంధాన్ని మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిందా?శ్వాసకోశ వ్యాధులలో వాయు కాలుష్యం పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ విధాన జోక్యాలను ప్లాన్ చేస్తుందా? సంవత్సరం వారీగా 6 ఆసుపత్రుల్లో AIIMS, సఫ్దర్‌జంగ్, LHMC గ్రూప్, RML, NITRD, VPCI) నమోదవుతున్న కేసులు, 2022-2025 నుండి మెట్రో నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో ఉబ్బసం, COPD , ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కారణంగా అవుట్ పేషెంట్ మరియు ఆసుపత్రిలో చేరేవారి పెరుగుదల వివరాలు?
ప్రభుత్వం అందించిన డేటా
2022: 67,054 అత్యవసర కేసులు. 9,874 అడ్మిషన్లు
2023: 69,293 అత్యవసర కేసులు. 9,727 అడ్మిషన్లు
2024: 68,411 అత్యవసర కేసులు. 10,819 మంది అడ్మిషన్లు
2024లో మొత్తం ఎమర్జన్సీ కేసుల సంఖ్య స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, అడ్మిషన్ అవసరమైన రోగుల సంఖ్య బాగా పెరిగింది, ఇది ఆసుపత్రులకు వచ్చే కేసులు, తీవ్రంగా పరిణమిస్తున్న వైనాన్నిసూచిస్తుంది. అయితే వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు, సంబంధిత వ్యాధులకు ప్రేరేపించే కారకాల్లో ఒకటి అయినప్పటికీ, అని ఆహారం, వృత్తి, సామాజిక-ఆర్థిక స్థితి మరియు ముందుగా ఉన్న పరిస్థితులతో సహా బహుళ కారకాలు ఆరోగ్య ప్రభావాలను ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.


