పార్లమెంట్‌ సమావేశాలు డే-3: లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నా | Parliament winter session 2025 Dec 3rd Live Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు డే-3: లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నా

Dec 3 2025 10:20 AM | Updated on Dec 3 2025 11:02 AM

Parliament winter session 2025 Dec 3rd Live Updates

Parliament winter session 2025 Updates..

ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్‌ ఎంపీల నిరసన..

  • ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసన
  • ఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలు
  • వాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడా

విపక్షాల ధర్నా..

  • పార్లమెంట్‌లో లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు  
  • కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణ
  • లేబర్ కోడ్‌ను ఉపసంహరించుకోవాలని నినాదాలు

కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..

  • నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. 

  • లోక్‌సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 

  • ఎస్ఐఆర్‌పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .

  • అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్‌పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం

  • డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ

  • చర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్

  • ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్‌పై కొనసాగనున్న చర్చ

  • చర్చకు 10 గంటల సమయం కేటాయింపు

  • డిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చ

  • వందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement