వారణాసి, సాక్షి : మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ (Devavrat Mahesh Rekhe) అరుదైన ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమైన ఆ వారణాసి అసాధారణమైన ఆధ్యాత్మిక క్షణాలకు వారణాసి వేదికగా నిలిచింది. వేద సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన వాటిలో ఒకటిగా ఈ పారాణయాన్ని భావించారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ పవిత్ర కార్యానికి గౌరవసూచకంగా, దేవవ్రతకు రూ.5 లక్షల విలువైన బంగారు కంకణం, రూ.1,11,116 విలువైన బంగారు కంకణాన్ని బహుకరించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం , జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ గుర్తింపు లభించింది. 500 మందికి పైగా వేద విద్యార్థులు, సాంప్రదాయ సంగీతకారులు , శంఖ రావాల ప్రతిధ్వనుల మధ్య వారణాసి పులకించిపోయింది. భక్తులు వీధుల్లో బారులు తీరి, జల్లులు కురిపించారు ఈ వేడుకలో, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతి తీర్థ మహాసన్నిధానం నుండి ఆస్థాన విద్వాన్ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ ప్రత్యేక ఆశీర్వాద సందేశాన్ని అందించారు.
సంక్లిష్టమైన స్వర-నమూనాలు మరియు శబ్ద ఖచ్చితత్వానికి వేద పారాయణ కిరీటంగా గౌరవించబడే దండక్రమం, నమోదు చేయబడిన చరిత్రలో మూడు సార్లు మాత్రమే నిర్వహించబడిందని, దేవవ్రత పారాయణం దోషరహితంగా అతి తక్కువ సమయంలో పూర్తయిందని శృంగేరి మఠం అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు
19 ఏళ్ల దేవవ్రత మహేష్ రేఖే అద్భుతమైన విజయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేవవ్రతుడి విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆ యువ పండితుడు శుక్ల యజుర్వేదంలోని 2,000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల పాటు నిరంతరాయంగా పూర్తి చేశాడని తెలుసుకుని సంతోషిస్తారని ఆయన అన్నారు. ఇంతటి అసాధారణ ఆధ్యాత్మిక క్రమశిక్షణను కాశీ పవిత్ర నేలపై జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా దేవవ్రతుడి కుటుంబం, సాధువులు, పండితులు, అతని కఠినమైన వేద అభ్యాసానికి దేశవ్యాప్తంగా అతనికి మద్దతు ఇచ్చిన సంస్థల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వల్లభరం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 30 వరకు పారాయణం నిర్వహించారు. శృంగేరి పీఠం వేదపోషక సభ ఆధ్వర్యంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ పరీక్షల ప్రధాన పరిశీలకుడు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే యువ పండితుడు మరియు అతని తండ్రి-గురువు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే ఇద్దరినీ సాధువులు , వేద పండితులు ప్రశంసించారు.
19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है।
भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o— Narendra Modi (@narendramodi) December 2, 2025


