ఇండిగో వైఫ్యలం, భారీ సంక్షోభంతో ఇతర విమానయాన సంస్థలు తమ ఇష్టారీతిన ధరలను పెంచేశాయి. అనేక మార్గాల్లో టిక్కెట్ల ధరలు భారీగా పెంచేసిన ప్రయాణీకులను దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ శనివారం దేశీయ విమాన ఛార్జీలపై పరిమితిని విధించింది. ప్రయాణికులనుంచి ఎటువంటి అదనపు ఫీజుల వసూలు చేయొద్దని, టికెట్ ధరలు పెంచకుండా పరిమితులు విధిస్తూ విమానయాన సంస్థలకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా, విమానయాన సంస్థలు కొత్తగా నిర్ణయించిన గరిష్ట ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయరాదని మంత్రిత్వ శాఖ తన ఆదేశంలో పేర్కొంది, కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ధరలను స్థిరీకరించడానికి ఈ ఆదేశాలిచ్చారు.
ఈ పరిమితి కింద, అనుమతించబడిన గరిష్ట ఛార్జీలు ఇలా ఉన్నాయి.
500 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 7,500
500 - 1,000 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 12,000
1,000 నుండి 1,500 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 15,000
1,500 కి.మీ కంటే ఎక్కువ ఉన్న మార్గాలకు రూ. 18,000
ఈ పరిమితికి లోబడే చార్జీలను వసూలు చేయాల్సి ఉంటుంది. అవకాశవాద ధరలు, అసాధారణంగా పెరిగిన విమాన ఛార్జీలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశించిన పరిమితులను మించి వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు మిస్ అయిన లేదా ఆలస్యమైన అన్ని సామాగ్రిని 48 గంటల్లోపు ట్రాక్ చేసి సంబంధీకులకు తిరిగి ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ఇండిగోకు తేల్చి చెప్పింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ప్రాసెస్ చేయాలి. ఏదైనా జాప్యం,లేదా నిర్లక్ష్యం జరిగినా నియంత్రణ చర్యలు తప్పవని పేర్కొంది.
.@MoCA_GoI Action on IndiGo Operational Crisis - Air Fare Regulation
💠 The Ministry of Civil Aviation has taken serious note of concerns regarding unusually high airfares being charged by certain airlines during the ongoing disruption. In order to protect passengers from any… pic.twitter.com/7KWRvPOECm— PIB India (@PIB_India) December 6, 2025
ప్రస్తుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలకు ప్రయాణానికి దేశీయ విమాన ఛార్జీలను భారీగా పెరిగాయి. ఒక్కె టికెట్ పైనా మూడు నాలుగు రెట్లు ధరలను వసూలు చేస్తున్నాయి. పెరిగాయి. ఉదాహరణకు, ఢిల్లీ నుండి ముంబైకి నాన్-స్టాప్ విమానం ధర రూ. 65,460కి పెరిగింది, అయితే వన్-స్టాప్ విమాన ఎంపికలు రూ. 38,376 నుండి రూ. 48,972 వరకు ఉన్నాయి. వందలాది విమానాల రద్దు, దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందుల తర్వాత కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంది. మరో మూడు రోజుల్లో విమానాలు, ప్రయాణాల అంతా సర్దుకుటుందని చెప్పింది. అలాగే ప్రయాణికులను అన్ని సౌకర్యాలను కల్పించాలని, పిల్లలు, వృద్ధులు, మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇండిగోను ఆదేశించింది. శుక్రవారం 1,000 కంటే ఎక్కువ విమానాలు రద్దు కాగా, శనివారం 400 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేసింది ఇండిగో.
ఇదీ చదవండి: ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటి


