సాక్షి, అమరావతి: ఇండిగో సంక్షోభంపై టీడీపీ పరువు పోగొట్టుకుంది. లోకేష్ రివ్యూ చేస్తున్నారంటూ.. జాతీయ మీడియాలో టీడీపీ అధికార ప్రతినిధి అతి చేశారు. అసలు నారా లోకేష్ ఎవరన్న అర్నబ్ గోస్వామి.. విమానయాన శాఖకు, లోకేష్‌కు సంబంధమేంటి? అంటూ ప్రశ్నించారు. ‘‘ఏ హోదాలో లోకేష్ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఇది పౌర విమానయాన శాఖ.. లేక టీడీపీ శాఖ?’ అంటూ అర్నబ్ మండిపడ్డారు. అర్నబ్ గోస్వామి ప్రశ్నలకు టీడీపీ నేత నీళ్లు నమిలారు.
విమాన ప్రయాణికుల కష్టాలు తీర్చడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని ఇతర ఎయిర్ లైన్స్ సొమ్ము చేసుకుంటున్నా రామ్మోహన్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండిగో సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇండిగో సంక్షోభాన్ని నారా లోకేష్ చక్కదిద్దుతున్నారని చెప్పుకుంటున్న టీడీపీ అధికార ప్రతినిధిని నారా లోకేష్‌కు ఏం సంబంధం అంటూ జాతీయ మీడియా చివాట్లు పెట్టింది. సంక్షోభాన్ని కూడా నారా లోకేష్ క్రెడిట్ కోసం వాడుకుంటున్నారంటూ నెటిజన్ల మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభ నివారణకు రామ్మోహన్ నాయుడు తూతు మంత్రంగా చర్యలు చేపట్టారు. సమీక్షలు, ప్రకటనలతోనే సరిపెట్టారు.

ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలు పరచడంలో తీవ్ర వైఫల్యం చెందారు. సేఫ్టీ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలును పట్టించుకోని రామ్మోహన్.. లక్షలాదిమంది ప్రయాణికులు ఆందోళనలకు దిగడంతో ఇండిగో పై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానికి తగిన విధంగా చర్యలు చేపట్టడంలో రామ్మోహన్‌నాయుడు విఫలయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.


