సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు డా.బీఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా ఈ కార్యక్రమానికి కార్యాలయ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నందమూరి లక్ష్మీ పార్వతి, మేరుగ నాగార్జున, జూపూడి ప్రభాకర్, దొంతిరెడ్డి వేమారెడ్డి, రాజశేఖర్ తదితరులు హాజరైయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైసిపి కార్యాలయంలో డా.బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్,చలమాల సత్యనారాయణ.
అనంతపురం: గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ లో అంబేద్కర్ వర్థంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.
కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజి ఎంపి కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య.
ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం చింతలపూడి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇంచార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాధరావు మరియు పలువురు వైసీపీ శ్రేణులు.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. పాల్గొన్న న్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ,బెల్లందుర్గ , మాజీ ఏపీఐడిసి ఛైర్మన్ బండి పుణ్యశీల, వైసిపి సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్పొరేటర్లు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు


